AP Political News Feb 3rd: పొలిటికల్ అప్‌డేట్స్

AP Political Updates Feb 3rd - Sakshi

AP Elections Political Latest Updates Telugu

06:02 PM, Feb 03, 2024
బాబు కుట్రలో భాగమే షర్మిల కాంగ్రెస్‌ చేరిక 

 • రాష్ట్ర విభజన కు కారణం టీడీపీ అధినేత చంద్రబాబు
 • వైఎస్ జగన్ పై అక్రమ కేసులకు కారణం చంద్రబాబే
 • చంద్రబాబు కుట్రలో భాగంగానే షర్మిల కాంగ్రెస్ లో చేరారు
 • ఏపీలో కాంగ్రెస్ చచ్చిపోయింది
 • కాంగ్రెస్ శవాన్ని షర్మిల, రఘువీరా రెడ్డి, కేవీపీ, గిడుగు రుద్రరాజు మోస్తున్నారు

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు
 

05:28 PM, Feb 03, 2024
పేదల భవిష్యత్‌ను కాటేసే ఎల్లో వైరస్‌పై యుద్ధానికి మీరు సిద్ధమా: సీఎం జగన్‌

 • రామాయణం, మహాభారతంలో ఉన్న విలన్లు అందరూ చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు రూపంలో ఇక్కడే ఉన్నారు
 • ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్‌ ఒంటరిగానే కనిపిస్తాడు
 • కానీ నిజం ఏంటంటే..కోట్ల మంది హృదయాల్లో జగన్‌ ఉన్నాడు
 • జగన్‌ ఒంటరివాడు కాదన్నది ఇక్కడ కనిపిస్తున్న జనమే నిజం
 • కోట్లాది మంది గుండెల్లో జగన్‌ ఉండటమే నిజం
 • నాకున్న సైన్యం, బలం.. దేవుడు, ప్రజలే: సీఎం జగన్‌
 • జగన్‌ ఎప్పటికీ ఒంటరివాడు కాదు
 • నా తోడు, నా ధైర్యం, నా బలం పైనున్న ఆ దేవుడు, మీరే
 • నాకున్న నమ్మకం మీరే
 • వచ్చే ఎన్నికల రణక్షేత్రంలో మీరంతా కృష్ణుడైతే నేను అర్జునుడిని
 • దుష్టచతుష్టయం దాడి అంతా అభివృద్ది, సంక్షేమం మీదనే
 • రాబోయే తరం విద్యావిధానాల మీద దుష్టచతుష్టయం దాడి చేస్తోంది
 • రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై టీడీపీ దండయాత్ర చేస్తోంది
 • మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ నెరవేర్చిన ప్రభుత్వం మనది
 • పేదవాడి భవిష్యత్తు, సంక్షేమం మీద వారంతా దాడి చేస్తున్నారు
 • గ్రామగ్రామాల్లో మనం తెచ్చిన మార్పు స్పష్టం కనిపిస్తోంది.
 • అవినీతి, వివక్షకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందించాం
 • అందించిన సంక్షేమ పాలనకు ప్రతీ పేద కుటుంబమే సాక్ష్యం
 • 175కు 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యం
 • నా మాటలన్నీ ప్రతీ ఇంటికి వెళ్లి పంచుకోవాలని కోరుతున్నా
 • చంద్రబాబు పాలనకు, జగన్‌ పాలనకు తేడాను గమనించండి
 • పేద కుటుంబాలకు చంద్రబాబు ఏం చేశాడో అడగండి
 • చంద్రబాబు హయాంలో ఇచ్చిన స్కీములు ఏమున్నాయో అడగండి
 • కుప్పం నుంచి ఇచ్చాపురం వరకూ ఏ గ్రామానైన్నా తీసుకోండి
 • గతంలో లేనిది ఇప్పుడు గ్రామాల్లో వచ్చిన మార్పును గమనించండి

02:35 PM, Feb 03, 2024
టీడీపీ, జనసేన మధ్య పొత్తుల కత్తులు

 • ఉమ్మడి కృష్ణాలో మూడు సెగ్మెంట్లపై టీడీపీ, జనసేన మధ్య టికెట్ల పితలాటకం
 • కృష్ణా జిల్లా అవనిగడ్డ, పెడన స్థానాలపై జనసేన ఫోకస్ 
 • ఇన్ ఛార్జ్ లేకపోయినప్పటికీ అవనిగడ్డలో జనసేనకు కేడర్ 
 • అవనిగడ్డ టికెట్ ఆశిస్తోన్న జనసేన నేత బండ్రెడ్డి రాము 
 • టీడీపీ నుంచి రేసులో మండలి బుద్ధ ప్రసాద్ 
 • పెడన స్థానంలో బలంగా ఉన్న టీడీపీ, జనసేన 
 • పెడన ఇన్‌ఛార్జ్‌గా పంచకర్ల రమేష్ ను నియమించిన పవన్ 
 • జనసేనలో చేరి పెడన నుంచి బూరగడ్డ వేదవ్యాస్ పోటీ? 
 • ఎన్టీఆర్ జిల్లాకు కీలక స్థానం విజయవాడ పశ్చిమ 
 • టికెట్ కోసం జనసేన ఇన్ ఛార్జ్ పోతిన మహేష్ ప్రయత్నాలు 
 • ఇప్పటికే టీడీపీ నుంచి బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్ బలప్రదర్శన 
 • పవన్ ను కలిసి తనకు అవకాశం ఇవ్వాలని కోరిన జలీల్ ఖాన్

02:19 PM, Feb 03, 2024
నంద్యాల జిల్లా: పాములపాడు మండలంలో టీడీపీకి షాక్

 • టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలోకి చేరిన మాజీ సర్పంచ్ జయసింహరెడ్డితో పాటు 150 కుటుంబాలు
 • పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి
 • మహా కూటమితో చంద్రబాబు ప్రజల్లోకి వస్తున్నారు: బైరెడ్డి సిద్దార్థ రెడ్డి
 • చంద్రబాబు వారి పార్టీ నేతల వద్ద డబ్బు సంచులు ఉన్నాయి
 • మా సీఎం జగనన్న వద్ద ప్రజా బలం ఉంది
 • గ్రామాలను అభివృద్ధి చేసిన ఏకైక సీఎం జగనన్న
 • 2019 ఎన్నికలు ఒక్కలెక్క 2024 ఒక్కలెక్క

01:10PM, Feb 03, 2024

టీడీపీ నేతల మోస పూరిత మాటలు నమ్మొద్దు: మంత్రి బొత్స

 • రాష్ట్రంలో సంక్షేమాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు
 • ఎల్లో మీడియా దుష్ప్రచారాలను ప్రజలు నమ్మరు
 • ఎన్ని కుట్రలు చేసినా వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయం
   

12:40PM, Feb 03, 2024

కృష్ణా జిల్లా:

 • పెనమలూరు,కంకిపాడు, ఉయ్యూరు నుండి దెందులూరు  సిద్ధం బహిరంగ సభకు భారీగా తరలివెళ్లిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు.
 •  దెందులూరు లో సీఎం జగన్ ‘సిద్ధం‘ సభకు పెడన నియోజకవర్గం ఇంచార్జ్‌ ఉప్పాల రాము ఆధ్వర్యంలో వేలాదిగా తరలి వెళ్లిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు

12:30PM, Feb 03, 2024

తూర్పుగోదావరి జిల్లా:

 • రాజానగరం నియోజకవర్గ నుండి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో 92 బస్సుల్లో వేలాదిగా సిద్ధం సభకు తరలిన అభిమానులు, కార్యకర్తలు

12:26PM, Feb 03, 2024

సిద్ధం సభకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి తరలివెళ్లిన కార్యకర్తలు

 • కార్యకర్తలతో కలిసి బయల్దేరిన ఎమ్మెల్యే, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వెలంపల్లి శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, ఎమ్మెల్సీ రుహుల్లా
 • బస్సులను జెండా ఊపి ప్రారంభించిన వెలంపల్లి శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి

12:23PM, Feb 03, 2024

గుడివాడ నుండి సిద్ధం సభకు వేలాదిగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు

 • దెందులూరులో సీఎం జగన్ సిద్ధం సభకు ఎమ్మెల్యే కొడాలి నాని నేతృత్వంలో గుడివాడ నుండి వేలాదిగా తరలి వెళ్లిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
 • గుడివాడ VKR VNB ఇంజనీరింగ్ కళాశాల వద్ద పార్టీ శ్రేణుల బస్సు ర్యాలీని పార్టీ జెండా ఊపి ప్రారంభించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్.

12:20PM, Feb 03, 2024

వైఎస్‌ జగన్‌ను మరోసారి సీఎం చేసేందుకు మేమంతా సిద్ధం: మంత్రి చెల్లుబోయిన

 • మరో ఐదేళ్లపాటు ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం
 • దెందులూరు సిద్ధం సభను విజయవంతం చేస్తాం
 • సేవే లక్ష్యంగా పని చేస్తున్న సీఎం జగన్‌ కోసం మేమంతా సిద్ధం
 • నాయకుడి లక్ష్యం నెరవేర్చడమే పార్టీ కేడర్‌ ఉద్దేశం
 • సిద్ధం సభ.. దేశ రాజకీయాల్లో సేవే లక్ష్యమని చాటి చెప్పడం
 • సేవకి సైన్యం సిద్ధమైంది

12:00PM, Feb 03, 2024

ఎల్లో మీడియా, చంద్రబాబుపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌

 • 2019 నుంచి కావలిలో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి
 • వైఎస్సార్‌సీపీకి  చెడ్డ పేరు తెచ్చేందుకు కొందరు..  టీడీపీలో టికెట్‌ ఆశిస్తున్న కొందరు పచ్చ మీడియాతో కలిసి దుష్ప్రచారం
 • నాతో పాటూ నా కుటుంబ సభ్యులపై కూడా బురద చల్లుతున్నారు
 • రాజకీయంగా నన్ను ఎదుర్కొనలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు
 • బోగోలు మండలంలో భూములు అక్రమించానని ఆరోపిస్తున్నారు
 • ఒక బహుళ జాతి కంపెనీ నుంచి కొనుగోలు చేస్తే..అక్రమించానని చెబుతున్నారు.. నా వద్ద అన్ని పత్రాలూ ఉన్నాయి
 • నా కుమారుడి పేరు మీద భూమి కొన్నాను.. వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం సరికాదు.. దమ్ముంటే నిరూపించాలి
 • నాది తప్పు అని తేలితే..అనాథ ఆశ్రమానికి భూమి రాసిస్తా

11:30AM, Feb 03, 2024

 • నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా  ఎండీ ఖలీల్ అహ్మద్‌ను నియమించడంపై హర్షం వ్యక్తం చేస్తున్న ముస్లిం మైనార్టీ నేతలు
 • మైనార్టీలను టీడీపీ, జనసేనలు కేవలం ఓటు బ్యాంకుగానే  వాడుకుంటున్నాయని మండిపడ్డ రూరల్ నియోజకవర్గ ముస్లిం మైనార్టీ నేతలు
 • మేము ఖలీల్ అహ్మద్‌ను గెలిపించుకుంటాం

11:23AM, Feb 03, 2024

ఎన్టీఆర్ జిల్లా:

 • తిరువూరు నుండి సిద్ధం సభకు దెందులూరుకు తరలివెళ్లిన పార్టీ శ్రేణులు
 • జెండా ఊపి బస్సులను ప్రారంభించిన నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామిదాస్

11:20AM, Feb 03, 2024

ఏలూరు జిల్లా: 

 • కైకలూరు నుండి సిద్ధం సభకు దెందులూరుకు తరలివెళ్లిన పార్టీ శ్రేణులు
 • జెండా ఊపి బస్సులను ప్రారంభించిన  ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు 

10:31AM, Feb 03, 2024

సీఎం జగన్‌ చరిష్మాతో గెలిచి తీరుతాను
సాక్షి టీవీతో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్

 • వైఎస్సార్‌సీపీతోనే మైనార్టీలకు సామాజిక న్యాయం
 • సామాన్యుడికి ఇంచార్జి అవకాశం ఇవ్వడం సీఎం జగన్‌కే సాధ్యం
 • నెల్లూరు సిటీలో అందరిని కలుపుకుని వెళ్తాను
 • సీఎం జగన్‌ చరిష్మాత​ గెలిచి తీరుతాను
 • మైనార్టీలను టీడీపీ ఓటు బ్యాంక్‌గా వాడుకుంటే.. సీఎం జగన్‌ ఏకంగా ఎమ్మెల్యే అభ్యర్థిగానే ప్రకటించారు
 • ప్రతీ ఇంటికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తున్నాం.. కచ్చితంగా గెలుస్తాం
 • మాజీ మంత్రి నారాయణలాగా నాకు వేల కోట్లే లేవ్‌.. నేనొక సామన్యుడిని
 • నాకు సీఎం జగన్‌ అండ ఉంది

10:20AM, Feb 03, 2024

సిద్ధం సభకు భారీగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు

డా.బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా:

 • రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పినిపే విశ్వరూప్ పర్యవేక్షణలో అమలాపురం నుండి ఏలూరు సిద్దం సభకు 100 బస్సులు,భారీ స్థాయిలో కారులలో బయలుదేరిన వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు

9:30AM, Feb 03, 2024

తిరుపతి జిల్లా: 

నా జీవితాంతం సీఎం జగన్‌కు రుణపడి ఉంటా: డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

 • చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు
 • నా ఊపిరి ఉన్నంత వరకు జీవితాంతం సీఎం జగన్‌కు రుణపడి ఉంటాను
 • జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, విజయ్ సాయిరెడ్డి ,సజ్జల సహకారం మరిచిపోలేను
 • పార్టీలో అన్నిమండలం నాయకులని సమన్వయం చేసుకుని భారీ మెజారిటీ తో గెలుస్తాను
 • సీఎం జగన్ మోహన్ రెడ్డి విద్య ద్వారా పేదలు జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు, వారి తలరాతలు మారుస్తున్నార
 • ఇల్లు లేని నిరుపేదలకు సొంతింటి కల నెరవేరుస్తున్నారు.
   

8:50AM, Feb 03, 2024

ఏలూరు జిల్లా: 

నేడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దెందులూరు పర్యటన

 • వైఎస్సార్‌సీపీ ఎన్నికల శంఖారావ సభ  ‘సిద్ధం’లో పాల్గొననున్న సీఎం జగన్‌
 • ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లా నుంచి హాజరు కానున్న లక్షలాది మంది క్యాడర్
 • 50 నియోజిక వర్గాల నుండి   తరలిరానున్న పార్టీ శ్రేణులు 
 • సభా ప్రాంగణంలో 12 ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు..
 • 110 ఎకరాల ప్రాంగణంలో సిద్ధం బహిరంగ సభకు పూర్తయిన ఏర్పాట్లు
 • 3,298మంది పోలీసులతో భారీ బందోబస్తు
 • పది ప్రాంతాల్లో 150 ఎకరాల పార్కింగ్ స్థలాలు సిద్ధం
 • మధ్యాహ్నం 3:20 గంటలకు దెందులూరు లోని హెలిపాడ్ ప్రాంగణానికి చేరుకోనున్న సీఎం
 • 3:30 గంటలకు సభా ప్రాంగణానికి సీఎం జగన్‌
 • 3:30 నుండి 4:45 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్న సీఎం

8:00AM, Feb 03, 2024

కుప్పాన్ని వదిలిపెట్టని బాబు అండ్‌ కంపెనీ

 • రాజకీయ భిక్ష పెట్టిన పురిటిగడ్డకు చంద్రబాబు నయవంచన
 • కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులు చేయకుండా కమీషన్లకే ప్రాధాన్యం
 • సాగు, తాగునీరు ముసుగులో అంచనా వ్యయం భారీగా పెంపు
 • సీఎం రమేష్‌ను అడ్డుపెట్టుకుని ఖజానాకు కన్నం..
 • కాంట్రాక్టు విలువ కంటే అధికంగా బిల్లులు చెల్లించినా పూర్తికాని పనులు
 • పాలార్‌పై రిజర్వాయర్‌ పనులకూ అడ్డుపడి పొట్టగొట్టిన చంద్రబాబు
 • కుప్పంను మున్సిపాల్టీగా చేసి రెవెన్యూ డివిజన్‌ చేసిన సీఎం జగన్‌..
 • కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పూర్తి చేసి కృష్ణా జలాల తరలింపు
 • ఇప్పటికే రామకుప్పం మండలానికి చేరుకున్న కృష్ణమ్మ
 • ఈ నెలలోనే కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను నియోజకవర్గ ప్రజలకు అంకితం చేయనున్న సీఎం జగన్‌

7:50AM, Feb 03, 2024

పవన్‌ చెప్పాడంటూ బాబు దొంగాట

 • పవన్‌ పేరుతో పలువురు సీనియర్లకు టిక్కెట్లు ఎగ్గొడుతున్న చంద్రబాబు 
 • తాను సీట్లు ఇవ్వొద్దని అనుకుంటున్న వారికి నేరుగా చెప్పడానికి భయం 
 • పవన్‌ చెప్పాడంటూ ఏడుగురికి టికెట్లు తిరస్కరణ.. గతంలో వారు పవన్‌ను తిట్టారనే సాకు 
 • వారికి సీట్లిస్తే జనసేన ఓట్ల బదలాయింపు ఉండదని పవన్‌ హెచ్చరించినట్లు ప్రచారం 
 • ఈ జాబితాలో చింతమనేని, చింతకాయల విజయ్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు 
 • పవన్‌ ముసుగులో దెందులూరులో చింతమనేనికి సీటు నిరాకరణ 
 • జనసేన అభ్యర్థి ద్వారా బుచ్చయ్య చౌదరికి ఎసరు.. అయ్యన్న కొడుకు విజయ్‌కీ సీటు లేదని చెప్పిన బాబు 
 • ఇదే జాబితాలో మరికొందరు ఉన్నట్లు అనుమానాలు 

7:40AM, Feb 03, 2024
బాబు.. ఓ ‘పిల్స్‌’ ఫ్యాక్టరీ

 • తప్పుడు కేసులతో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న టీడీపీ అధినేత
 • చంద్రబాబు స్పాన్సర్డ్‌ కేసులతో రాష్ట్రాభివృద్ధికి ఆటంకాలు
 • ప్రజాహిత వ్యాజ్యాలను కూడా అపవిత్రం చేసిన ఘనత టీడీపీదే 
 • రాష్ట్రంలో కరోనా వైరస్‌ కన్నా ప్రమాదకరంగా పచ్చ మీడియా తీరు
 • తప్పుడు కేసులతో జగన్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర  
 • జగన్‌ పాలన–న్యాయవాదుల స్పందన’ అంశంపై రాష్ట్రస్థాయి సదస్సులో న్యాయ రంగ ప్రతినిధులు, మేథావులు

7:30AM, Feb 03, 2024

ఎంపీ స్థానాలంటే హడలిపోతున్న టీడీపీ నేతలు

 • అనంతపురం టీడీపీలో అభ్యర్థుల వెనకడుగు
 • ఎంపీలుగానే పోటీచేయాలని జిల్లా పార్టీ అధ్యక్షులకు అధిష్టానం ఆదేశం 
 • ససేమిరా అంటున్న కాలవ శ్రీనివాసులు, బీకే పార్థసారథి 
 • టికెట్లు ప్రకటిస్తే అసమ్మతి నేతల గమనంపై ఆందోళన 
 • చేసేది లేక అభ్యర్థుల ఎంపికలో సాగదీత ధోరణి 

7:25AM, Feb 03, 2024

కిరాయి ఇవ్వకపోతే టీడీపీ నాయకులను అడ్డుకుంటాం

 • అరకులో టీడీపీ‘రా కదలిరా’ సభకు ఆటోల ద్వారా ప్రజల తరలింపు
 • కిరాయి డబ్బుల కోసం డ్రైవర్ల ఆందోళన  
 • ఒక్కొక్క ఆటోకు రూ.2,500 ఇస్తామని నేతలు ఒప్పందం
 • కొంతమందికి మాత్రమే రూ.500 అడ్వాన్స్‌ ఇచ్చారు
 • మరికొందరికి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా సభకు ఆటోలు తరలింపు
 • సభ జరిగి రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు కిరాయిలు ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్న టీడీపీ నేతలు
 • కిరాయిలు ఇవ్వకపోతే ఓట్ల కోసం తమ గ్రామాలకు వచ్చే టీడీపీ నాయకులను అడ్డుకుంటామంటున్న డ్రైవర్లు

7:22AM, Feb 03, 2024

వైఎస్సార్‌సీపీలో చేరిన విజయవాడ మాజీ డిప్యూటీ మేయర్‌ 

 • వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ నేత , విజయవాడ మాజీ డిప్యూటీ మేయర్‌ గోగుల వెంకట రమణ
 • నిన్న(శుక్రవారం )ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిక
   

7:20AM, Feb 03, 2024

 • రాజకీయ ఊసరవెల్లి పురందేశ్వరి
 • భీమవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గ్రంధి శ్రీనివాస్‌ ధ్వజం
 • దమ్ముంటే పవన్, చంద్రబాబు భీమవరంలో పోటీ చేయాలని సవాల్‌

7:15AM, Feb 03, 2024

ఫేక్‌ ఐడీలతో టీడీపీ పోస్టింగ్‌లు

 • పులివెందుల పోలీసులకు గతంలోనే వర్రా రాఘవరెడ్డి ఫిర్యాదు
 • తెర వెనుక ఐ–టీడీపీ
 • వెలుగులోకి మరో కుట్ర కోణం 

7:10 AM, Feb 03, 2024
టీడీపీ-జనసేనల మధ్య మనస్పర్థలు

 • నియోజకవర్గాలపై ఇంకా రాని స్పష్టత 
 • పాదయాత్రల పేరిట రెండు పార్టీల నాయకుల బలప్రదర్శన 
 • జనసేన బలంగా ఉన్న చోట టిడిపి నేతల పాదయాత్రలు 
 • పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలో జనసేన మహా పాదయాత్ర 
 • సత్తెనపల్లి జనసేన సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు పాదయాత్ర 
 • గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జనంతో జనసేన యాత్ర
 • బలం చూపించుకోవాలని పోటాపోటీగా తాపత్రయపడుతోన్న క్యాడర్‌
 • పొత్తుల తక్కెడలో తేలని లెక్కలతో చొక్కాలు చించుకుంటోన్న పవన్‌, బాబు

6:50 AM, Feb 03, 2024
ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేతల టెన్షన్ టెన్షన్ 

 • వైఎస్సార్‌సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల కోసం చూస్తోన్న టీడీపీ 
 • పార్ధసారథి, వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరిక ఖాయమంటున్న పార్టీ నేతలు
 • తిరువూరు నియోజకవర్గంలో తెరపైకి కొలికలపూడి శ్రీనివాసరావు
 • ఆందోళనలో ప్రస్తుత తిరువూరు ఇంచార్జ్ శావల దేవదత్
 • పార్ధసారథిని నూజివీడుకి ఒప్పించేందుకు టీడీపీ హైకమాండ్ నానా హైరానా
 • మైలవరం, పెనమలూరు టీడీపీ నేతల్లో ఉత్కంఠ
 • దేవినేని ఉమా వర్సెస్ వసంత కృష్ణ ప్రసాద్
 • ఒకరికి పెనమలూరు, మరొకరికి మైలవరం కేటాయించేందుకు ప్రయత్నాలు
 • ఇప్పటికే ఈ రెండు నియోజకవర్గాల్లో వివిధ ఏజెన్సీల ద్వారా హైకమాండ్ సర్వేలు
 • విజయవాడ పశ్చిమ టీడీపీ లో గందరగోళం
 • బుద్ధ వెంకన్న, జలీల్ ఖాన్ పోటాపోటీ బల ప్రదర్శనలు
 • పొత్తులో భాగంగా జనసేన కు ఇచ్చే సీట్లపై రాని క్లారిటీ
 • విజయవాడ పశ్చిమ, అవనిగడ్డలు జనసేనకు అంటూ ప్రచారం
 • నూజివీడులో ప్రస్తుతం ఇంచార్జ్ గా ఉన్న ముద్రబోయిన వెంకటేశ్వరరావు
 • తనని విస్మరిస్తే ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతానంటూ ముద్రబోయిన హెచ్చరికలు

6:45 AM, Feb 03, 2024
రీజనల్ ఇన్‌ఛార్జ్‌లుగా వైవీ సుబ్బారెడ్డి, మజ్జి శ్రీనివాస్‌ నియామకం

 • అనకాపల్లి, విశాఖపట్నం, అరకు, విజయనగరం, శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గాలకు రీజనల్ ఇన్‌ఛార్జీగా వైవీ సుబ్బారెడ్డి
 • అరకు పార్లమెంటు నియోజకవర్గంలోని సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గాలకు, దీంతో పాటు విజయనగరం, శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గాలకు మజ్జి శ్రీనివాసరావు డిప్యూటీ రీజినల్ కో- ఆర్డినేటర్‌గా నియామకం
 • ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం
 • నాలుగు పార్లమెంట్‌, ఆరు అసెంబ్లీ స్థానాలకు నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల ప్రకటన

whatsapp channel

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top