జీవో నెం.1పై తాత్కాలిక స్టే విధించిన హైకోర్టు | AP High Court imposed Temporary stay on GO NO.1 | Sakshi
Sakshi News home page

జీవో నెం.1పై తాత్కాలిక స్టే విధించిన హైకోర్టు

Jan 12 2023 4:22 PM | Updated on Jan 12 2023 5:36 PM

AP High Court imposed Temporary stay on GO NO.1 - Sakshi

సాక్షి, అమరావతి: సీపీఐ నేత రామకృష్ణ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 23 వరకు జీవో నెం.1పై హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. 

కాగా, హైకోర్టులో విచారణలో భాగంగా ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరాం వాదనలు వినిపించారు. పిల్‌పై ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేదన్నారు. నిబంధనల ప్రకారం ఈ కేసు రోస్టర్‌లో రావడానికి ఆస్కారం లేదు. వెకేషన్‌ బెంచ్‌ విధాన నిర్ణయాల కేసులను విచారించకూడదు. జడ్జీలను ఎంపిక చేసుకోవడంలో భాగంగా ఒక రాజకీయ పార్టీ దీన్ని ఉపయోగించుకుంటోంది అని స్పష్టం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement