21 నుంచి అసెంబ్లీ సమావేశాలు | Andhra Pradesh Assembly meetings from 21 June 2024 | Sakshi
Sakshi News home page

21 నుంచి అసెంబ్లీ సమావేశాలు

Published Wed, Jun 19 2024 4:42 AM | Last Updated on Wed, Jun 19 2024 4:42 AM

Andhra Pradesh Assembly meetings from 21 June 2024

2 రోజులపాటు నిర్వహించే అవకాశం 

సాక్షి, అమరావతి: ఈ నెల 21వ తేదీ నుంచి అసెంబ్లీ సమా­వేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావి­స్తు­న్నట్లు తెలిసింది. తొలుత 19వ తేదీ అను­కున్నా, ఆ తర్వాత 24 నుంచి నిర్వహించాలని యోచించింది. ఎక్కువ మంది మంత్రులు ఇంకా బాధ్యతలు తీసుకోకపోవడం, పలు ఇతర కార­ణాలతో 21 నుంచి సమావేశాలు నిర్వహించా­లని ప్రభుత్వం నిర్ణయించినట్లు టీడీపీ వర్గాలు తెలి­పాయి. 2 రోజులపాటు సమావేశాలు నిర్వ­హి­స్తా­రని సమాచారం. మొదటిరోజు ఎన్నికైన ఎమ్మె­ల్యేల ప్రమాణం, రెండవ రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక నిర్వహిస్తారని చెబుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement