పవన్‌ పరిధి చాలా చిన్నది | Advocate Rajini Strong Counter To Pawan Kalyan: Andhra pradesh | Sakshi
Sakshi News home page

పవన్‌ పరిధి చాలా చిన్నది

Jun 22 2026 4:29 AM | Updated on Jun 22 2026 4:29 AM

Advocate Rajini Strong Counter To Pawan Kalyan: Andhra pradesh

‘డెప్యూటీ సీఎం’ రాజ్యాంగబద్ధ పదవి కాదు.. అది ఆయన తెలుసుకోవాలి 

తొక్కిపెట్టి నార తీస్తా.. కాలుకు కాలు, చేయికి చేయి తీసేస్తా.. అరచేతుల్లో గీతలు లేకుండా చేస్తా అని అనడమేంటి? 

ఉప ముఖ్యమంత్రి ఇలా పిచ్చి మాటలు మాట్లాడతారా? 

మీకిచ్చిన శాఖలు మీరు చూసుకోండి చాలు 

మహిళా ఐక్యవేదిక సమావేశంలో అడ్వొకేట్‌ రజని

సాక్షి, విజయవాడ :  డెప్యూటీ సీఎం పదవి అనేది రాజ్యాంగబద్ధమైనది కాదని.. ఆ విషయం పవన్‌కళ్యాణ్‌ తెలుసుకోవాలని అడ్వొకేట్‌ రజని హితవు పలికారు. ఆయన పరిధి చాలా చిన్నదని, ఆయనకు కేటాయించిన శాఖలు ఆయన చూసుకుంటే చాలన్నారు. ఆదివారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ‘సాయికృష్ణ లాకప్‌డెత్‌–పౌరహక్కులు’ అంశంపై జరిగిన మహిళా ఐక్యవేదిక సమావేశంలో ఆమె ప్రసంగించారు. నేరస్తులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులకే వారిని శిక్షించే అధికారంలేదని.. అలాంటిది డెప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్‌ కాలుకు కాలు.. చేయికి చేయి తీసేస్తా.. తొక్కిపట్టి నారతీస్తా అనడం ఏంటని ఆమె ప్రశ్నించారు.

రజని ఇంకా ఏమన్నారంటే.. పవన్‌ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారా? లేక సామంత రాజునని  అనుకుంటున్నారా? ఆయన వాడే పదజాలం పబ్లిక్‌లో ఉన్నప్పుడు వాడకూడదని ఎవరూ ఆయనకు చెప్పకపోవడం దౌర్భాగ్యం. డెప్యూటీ సీఎం హోదాలో ఉన్నవ్యక్తి ఇలా పిచ్చి మాటలు మాట్లాడడం ఏమిటి?  హోంమంత్రి మీద అంత ప్రేమ ఉంటే పవన్‌ రాఖీ కట్టించుకోవాలి. ఆయన శాఖలో పనిచేస్తున్న ఒక దళిత మహిళను నడిరోడ్డుపై పోలీసు లాఠీతో జనసేన నేతలు కొందరు కొడితే పవన్‌ ఎందుకు స్పందించలేదు?  

తప్పు జరగకపోతే ప్రభుత్వం సిట్‌ ఎందుకు ఏర్పాటుచేసినట్లు? 
సామాజికవేత్త వసుంధర కుర్రా, హైకోర్టు బార్‌ కౌన్సిల్‌ మెంబర్‌ గంగాభవానీ  మాట్లాడుతూ.. ‘40 రోజులుగా కనిపించకుండాపోయినా సాయికృష్ణ ఉన్నాడా? లేడా?.. ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఏమీ జరగకపోతే ప్రభుత్వం ఎందుకు సిట్‌ ఏర్పాటు చేసింది? సిట్‌ అధికారులు స్వర్గపురి శ్మశానంలో వివరాలు సేకరిస్తున్నారంటే తప్పు జరిగిందనే కదా.. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏదో జరిగిందనే అనుమానాలు కలుగుతున్నాయి. మన రాష్ట్రంలో పబ్లిక్‌గా డ్రగ్స్‌ తీసుకునే ఎంపీలు,  అమ్మాయిలను వేధించే ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ వారిని ఏమీ అనరు. కర్నూలులో గంగమ్మ అనే మహిళ పోలీసుల కస్టడీలో ఉండగానే చనిపోయింది. వీటిపై సీబీఐ విచారణ జరిపించాలి’ అని డిమాండ్‌ చేశారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement