రాష్ట్రాలకు మన ‘పాఠాలు’

Adimulapu Suresh says other states looking towards AP school reforms - Sakshi

పాఠశాలల సంస్కరణలపై రాష్ట్రం వైపు ఇతర రాష్ట్రాల చూపు

33 నెలల్లో విద్యా రంగానికి రూ.90,000 కోట్ల వ్యయం

నాడు నేడు కింద కార్పొరేట్‌ స్థాయికి ప్రభుత్వ స్కూళ్లు

అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌  

సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. పలు రాష్ట్రాలు మన రాష్ట్ర విద్యా వ్యవస్థలో సంస్కరణలను పరిశీలిస్తున్నాయని తెలిపారు. నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్థాయికి మార్చడంతో ప్రభుత్వ పాఠశాలలకు భారీగా విద్యార్థులు వస్తున్నారన్నారు. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా ప్రమాణాలను పెంచడానికి తీసుకుం టున్న చర్యలపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.

గడిచిన 33 నెలల్లో రూ.90,000 కోట్లు విద్యా రంగంపై ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు. జగనన్న అమ్మఒడి కింద రూ,13,023 కోట్లు  ఇవ్వగా, నాడు–నేడులో ఇప్ప టి వరకు రూ.3,669 కోట్లతో స్కూళ్లను ఆధునీకరించినట్లు చెప్పారు. పిల్లలకు పౌష్ఠికాహారం కో సం జగనన్న గోరుముద్ద కింద రూ.1,600 కోట్లు, జగనన్న విద్యా కానుక కింద రూ.1,437.31 కోట్లు వ్యయం చేశామన్నారు. రూ.444.89 కోట్లతో స్కూళ్లలో మరుగుదొడ్లు నిర్మించామని, పాఠశాలల నిర్వహణకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేశామని తెలిపారు. పేదవాడికి ఇంగ్లిష్‌ విద్యను అందుబాటులోకి తెచ్చామన్నారు. పాఠశాలల పునర్వ్యవస్థీకరణలో ఒక్క పాఠశాల కూడా మూత పడలేదని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల చేత మరుగుదొడ్లు కడిగిస్తున్నారంటూ కొందరు సభ్యులు చేసిన ఆరోపణలను మంత్రి ఖండించారు.  

వాయిదా తీర్మానాలకు తిరస్కరణ
పీఆర్సీపై పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు, ఉద్యోగాల భర్తీపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్టు మండలి చైర్మన్‌ మోషేన్‌రాజు ప్రకటించారు. 

విద్యార్థులకు మైక్రోసాఫ్ట్‌తో అప్‌స్కిల్లింగ్‌ కార్యక్రమం
రాష్ట్రంలో డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఉద్యోగావకాశాలను పెంపొందించేందుకు మైక్రోసాఫ్ట్‌ ఆధ్వర్యంలో అప్‌స్కిల్లింగ్‌ ప్రోగ్రామ్‌ను ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేస్తుందని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. శాసన మండలి ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఒక ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలో 1.62 లక్షల మంది విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ ఇవ్వాలని  లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు 

‘ఆటోలపై చలానాలు టీడీపీ సర్కారులోనే ఎక్కువ’
వాహనమిత్ర పథకం ద్వారా మూడు విడతలుగా 7,64,465 మంది లబ్ధిదారులకు రూ. 764.46 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందని మంత్రి పేర్ని నాని చెప్పారు. శాసన మండలి ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. చలానాల పేరుతో ఆటోలు నడిపే వారి నుంచి టీడీపీ ప్రభుత్వం ఎక్కువ వసూళ్లు చేసిం దని చెప్పారు. 2015 నుంచి ప్రతి ఏటా ఎంత మొత్తం ఆటో, క్యాబ్‌ల నుంచి వసూలు చేసిందో వివరించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top