నామినేషన్‌ వేస్తే క్రిమినల్‌ కేసు పెడతా | - | Sakshi
Sakshi News home page

నామినేషన్‌ వేస్తే క్రిమినల్‌ కేసు పెడతా

Nov 22 2026 2:23 AM | Updated on Nov 22 2026 2:23 AM

● సర్పంచ్‌ అభ్యర్థికి సీఐ బెదిరింపు

విడపనకల్లు: పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్‌ వేస్తే క్రిమినల్‌ కేసు పెడతానంటూ సీఐ బెదిరించిన ఘటన శనివారం కరకముక్కల గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలు.. కరకముక్కల పంచాయతీ సర్పంచు పదవి ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. వైఎస్సార్‌సీపీ మద్దతుతో పరంగి గోపాల్‌ శనివారం సర్పంచ్‌ స్థానానికి నామినేషన్‌ వేయడానికి సిద్ధమయ్యాడు. ఉరవకొండ సీఐ ఈరన్న నేరుగా గ్రామానికి చేరుకుని సర్పంచ్‌ స్థానానికి నామినేషన్‌ వేయొద్దంటూ గోపాల్‌కు హుకుం జారీ చేశాడు. ‘నామినేషన్‌ వేస్తే ఇబ్బందులు పడతావు చూడు, గతంలో మీ వైఎస్సార్‌సీపీ వ్యక్తిని ఏకగ్రీవంగా చేశారంట. ఈ సారి టీడీపీ వాళ్లను ఏకగ్రీవం కానివ్వండి. నామినేషన్‌ వేస్తే ఎత్తుకెళ్లి క్రిమినల్‌ కేసులు పెడతా’ అంటూ బెదిరించాడు. తాను డిగ్రీ వరకూ చదువుకున్నానని, గ్రామానికి సేవ చేయాలనే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు గోపాల్‌ స్పష్టం చేశాడు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన పోలీసులే ఇలా అభ్యర్థులను బెదిరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement