జిల్లా అంతటా శనివారం రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఉదయం పూట చలి వాతావరణం పెరిగింది. ఈశాన్యం దిశగా గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. | - | Sakshi
Sakshi News home page

జిల్లా అంతటా శనివారం రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఉదయం పూట చలి వాతావరణం పెరిగింది. ఈశాన్యం దిశగా గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.

Nov 22 2026 2:23 AM | Updated on Nov 22 2026 2:23 AM

ఉపాధి పనులు ఆపేయండి

● అధికారులకు ఎమ్మెల్యే అమిలినేని హుకుం

● చేస్తున్న పనులను నిలిపేసిన వైనం

● పొట్టకొట్టొద్దంటూ కూలీల వేడుకోలు

బ్రహ్మసముద్రం : వలసలు ఆపి.. ఉన్న ఊరిలోనే పనులు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి పనులను కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అర్ధంతరంగా నిలిపివేయించి కూలీల పొట్ట కొట్టారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలం ముప్పలకుంట గ్రామంలో శనివారం ఉదయమే కూలీలు ఉపాధి పనులకు వెళ్లారు. ఫీల్డ్‌ అసిస్టెంట్‌ హాజరు నమోదుకు ఉపక్రమించిన సమయంలో సంబంధిత అధికారుల నుంచి ఫోన్‌ వచ్చింది. ‘హాజరు వేయకండి’ అని చెప్పి ఫోన్‌ పెట్టేశారు. ఈ మాటతో కూలీలు ఆశ్చర్యపోయారు. వెంటనే ఎంపీడీఓ ఏకాంబరేశ్వరయ్యకు ఫోన్‌ చేసి విషయం ఆరా తీశారు. ‘మాకు ఏమీ తెలియదు. ఎమ్మెల్యే ఆఫీస్‌ నుంచి ఆర్డర్‌ వచ్చింది. కావున మీ గ్రామంలో కూలీలకు ఉపాధి పనులు లేవని సార్‌ చెప్పారు. ఏమైనా సమస్య ఉంటే మీ గ్రామ రాజకీయాలు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుతో మాట్లాడుకోండి’ అని తెలిపారు. ‘ఇది కష్ట కాలం సార్‌.. వర్షాలు సరిగా పడలేదు. ఉపాధి హామీ పనిపైనే ఆధారపడి బతుకుతున్నాం. ముందస్తు సమాచారం తెలపకుండా చేస్తున్న పనులను ఉన్నపళంగా ఆపేస్తే ఎలా? దయచేసి పనులు ఆపొద్దు’ అని కూలీలు ప్రాధేయపడగా.. తానేమీ చేయలేనని, ఎమ్మెల్యేను కాదని పని చేయలేమని, మీకు ఇష్టం వచ్చిన వారికి కంప్లైంట్‌ చేసుకోండ అంటూ ఎంపీడీఓ ఫోన్‌ పెట్టేశారు. పంచాయతీ ఎన్నికల పేరుతో రాజకీయం అంటగట్టి.. అధికార పార్టీ నాయకులు, అధికారులు ఇలా పనులు ఆపేయడం ఏమిటంటూ కూలీలు మనస్తాపం చెందారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఉపాధి పనులు కల్పించి.. తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement