ప్రశాంతి నిలయం: ఆధ్యాత్మిక క్రమశిక్షణతో హృదయశుద్ధి సాధ్యమని, తద్వారా సమాజానికి నిస్వార్థ సేవలు అందించవచ్చని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ వి.మోహన్ అన్నారు. ప్రశాంతి నిలయంలో సత్యసాయి సేవాదళ్ 10వ జాతీయ సదస్సు శనివారం ముగిసింది. రెండోరోజు ప్రధానంగా సేవ, ఆధ్యాత్మికత, సేవాదళ్ సభ్యులకు ఉండాల్సిన గుణాలు తదితర అంశాలపై వక్తల ప్రసంగించారు. సత్యసాయి సేవా సంస్థల జాతీయ మహిళా కోఆర్డినేటర్ డాక్టర్ శివబాల మాట్లాడుతూ సత్యసాయి సేవా స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో అచరించాల్సిన అవసరం ఉందన్నారు. నిస్వార్థ సేవ, భక్తితోనే మానవ జీవితం పరిపూర్ణత సాధిస్తుందన్నారు. అనంతరం ముఖ్య అతిథి డాక్టర్ మోహన్ మాట్లాడుతూ, సత్యసాయి చూపిన మార్గంలో మానవుడు లౌకిక సేవ కాకుండా నిస్వార్థ సేవను ఆచరించాలన్నారు. సేవను హృదయ శుద్ధి సాధనంగా భావించరాదని, అహాన్ని కరిగించి దైవత్వం వైపు నడిపే ఆధ్యాత్మిక క్రమశిక్షణగా గుర్తించాలన్నారు.
ప్రసంగిస్తున్న డాక్టర్ మోహన్
ప్రత్యేక అలంకరణలో సత్యసాయి మహాసమాధి


