వైభవం.. గంధం ఉత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవం.. గంధం ఉత్సవం

Nov 22 2026 2:23 AM | Updated on Nov 22 2026 2:23 AM

● ప్రారంభమైన బాబయ్యస్వామి దర్గా ఉరుసు మహోత్సవాలు

పెనుకొండ రూరల్‌: మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన పెనుకొండలోని హజ్రత్‌ ఖ్వాజా సయ్యద్‌ షా బాబా ఫకృద్దీన్‌ (బాబయ్య స్వామి) దర్గా 754వ ఉరుసు (గంధం) మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నాలుగు రోజులపాటు జరిగే మహోత్సవాల్లో భాగంగా తొలిరోజు శనివారం రాత్రి అత్యంత ప్రధానమైన గంధం వేడుకలను వైభవంగా నిర్వహించారు.

స్వామివారికి మొదటి గంధం : ఉత్సవాల్లో భాగంగా మొదటి గంధం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వంశపారంపర్యంగా వస్తున్న ఆచారం మేరకు మొదటి గంధం వేడుకలను సజ్జద్‌ బాబా ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు నిర్వహించారు. ధ్యాన మందిరం నుంచి గంధాన్ని ఉరేగింపుగా తీసుకెళ్లి స్వామివారికి సమర్పించారు.

సర్వమతాల సారం ఒక్కటే : సర్వమతాల సారం ఒక్కటేనని మత పెద్దలు ప్రవచించారు. ఖవ్వాలి మందిరం సమీపంలో నిర్వహించిన సర్వమత సమ్మేళనం హిందూ, ముస్లిం ఐక్యత, సోదర భావాన్ని చాటింది. రాగద్వేషాలు వీడటంతో పాటు ధన, మద, మోహాలు త్యజిస్తేనే జీవితం సార్థక మవుతుందని మతపెద్దలు సూచించారు. ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు సహా వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలిరావడంతో పెనుకొండ పట్టణం కిటకిటలాడింది. కార్యక్రమంలో కడపకు చెందిన హజరత్‌ మౌలానా మహ్మద్‌ అబ్దుల్‌ సత్తార్‌, సిద్ద సమాధి యోగా శిక్షకులు రవి శంకర్‌ గురూజీ, ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన మహ్మద్‌ అల్తాఫ్‌ బాబా, గుంటూరు జిల్లాకు చెందిన మహ్మద్‌ నిజాముద్దీన్‌తో పాటు జనాబ్‌ సయ్యద్‌ ఖాన్‌, జనాబ్‌ అతుల్‌ ఖాన్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement