అనంతపురం: అండర్–23 రాష్ట్ర క్రికెట్ జట్టుకు జిల్లా నుంచి కోగటం హనీష్ వీరా రెడ్డి, దీపక్, మల్లికార్జున ఎంపికయ్యారు. హనీష్ లెఫ్ట్‌హ్యాండ్ బ్యాటర్. టాప్ ఆర్డర్లో నిలకడగా రాణిస్తున్నాడు. దీపక్ లెఫ్ట్‌హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. మల్లికార్జున లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. వీరి ఎంపిక పట్ల జిల్లా క్రికెట్ అసోసియేషన్ (ఏడీసీఏ) అధ్యక్షుడు సి. శ్రీనాథ్, కార్యదర్శి టి.శ్రీధర్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
కోగటం హనీష్ వీరా రెడ్డి, దీపక్, మల్లికార్జున


