చైనా–అమెరికా సాన్నిహిత్యంతో భారత్‌కు కొత్త సవాళ్లు | - | Sakshi
Sakshi News home page

చైనా–అమెరికా సాన్నిహిత్యంతో భారత్‌కు కొత్త సవాళ్లు

Oct 2 2026 1:10 AM | Updated on Oct 2 2026 1:10 AM

అనంతపురం: ‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ నాయకత్వంలో ఆ దేశాల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం ప్రస్తుత ప్రపంచ భౌగోళిక–రాజకీయ పరిస్థితుల్లో సందిగ్ధతను సృష్టిస్తోంది. ముఖ్యంగా భారత్‌ వంటి దేశాలు కొన్ని సవాళ్లతో కూడిన పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంది’ అని లాటిన్‌ అమెరికాలోని పలు దేశాలకు రాయబారిగా పనిచేసిన ఆర్‌.విశ్వనాథన్‌ (విశ్రాంత ఐఎఫ్‌ఎస్‌) అన్నారు. ‘మారుతున్న భౌగోళిక–రాజకీయ పరిస్థితుల్లో భారత్‌ అవకాశాలు’ అనే అంశంపై బీకేఎస్‌ మండలం జంతలూరు వద్ద ఉన్న ఏపీ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో గురువారం జరిగిన సదస్సుకు ఆయన విశిష్ట అతిథిగా హాజరై మాట్లాడారు. రెండు ప్రపంచ యుద్ధాలను ఎదుర్కొన్నప్పటికీ యూరప్‌ దేశాలు యూరోపియన్‌ యూనియన్‌ రూపంలో ఏకమయ్యాయన్నారు. అలాగే భారత్‌ కూడా తన పొరుగు దేశాలతో మరింత సన్నిహిత సంబంధాలు, అనుసంధానం, సహకారానికి గల అవకాశాలను అన్వేషించాల్సి ఉందన్నారు. ప్రస్తుత ప్రపంచ భౌగోళిక–రాజకీయ వ్యవస్థను ప్రభావితం చేస్తున్న ప్రధాన అంశాల్లో చమురు, ప్రాదేశిక వివాదాలు, సాంస్కృతిక పోటీ ముఖ్యమైనవన్నారు. సెంట్రల్‌ వర్సిటీ ఇన్‌చార్జ్‌ వీసీ సి.షీలారెడ్డి, కన్వీనర్‌ డా. బాబు, డా. సందీప్‌, డా.రాజేష్‌ కోటా, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రసంగిస్తున్న ఆర్‌.విశ్వనాథన్‌, సదస్సుకు హాజరైన ప్రముఖులు, విద్యార్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement