మద్యానికి డబ్బులివ్వలేదని యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

మద్యానికి డబ్బులివ్వలేదని యువకుడి ఆత్మహత్య

Oct 2 2026 1:10 AM | Updated on Oct 2 2026 1:10 AM

రాయదుర్గం రూరల్‌: మండలంలోని టి.వీరాపురం గ్రామానికి చెందిన మోదూరు ధనుంజయ (34) బుధవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు.. ఆటో తోలుకుంటూ జీవనం సాగించే ధనుంజయ మద్యానికి బానిసయ్యాడు. బుధవారం మద్యం సేవించి ఇంటికి వచ్చిన ధనుంజయ సాయంత్రం మద్యం తాగాలి డబ్బులివ్వాలంటూ భార్య మహాలక్ష్మిని వేధించాడు. దీంతో ఆమె పిల్లలను వెంటబెట్టుకొని అదే గ్రామంలో ఉన్న పుట్టింటికి వెళ్లింది. గురువారం ఉదయం పిల్లలను స్కూల్‌ పంపేందుకు యూనిఫాం కోసం ఇంటికి వచ్చింది. ఇంటి తలుపులు తీయగా సీలింగ్‌కు ఉన్న గ్రిల్‌కు భర్త ఉరి వేసుకుని ఉండడాన్ని గమనించి బోరున విలపించింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement