రబీలో 1.08 లక్షల హెక్టార్లలో సాగుకు ప్రణాళిక | - | Sakshi
Sakshi News home page

రబీలో 1.08 లక్షల హెక్టార్లలో సాగుకు ప్రణాళిక

Oct 2 2026 1:10 AM | Updated on Oct 2 2026 1:10 AM

ఉరవకొండ: ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో రబీలో పంటల సాగుకు సంబంధించి 1.08 లక్షల హెక్టార్లలో విత్తన ప్రణాళిక రూపొందించి అమలుదిశగా చర్యలు చేపట్టామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సాలురెడ్డి పేర్కొన్నారు. గురువారం ఉరవకొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రబీలో ప్రదానంగా 65 వేల హెక్టార్లలో పప్పుశనగ, 16 వేల హెక్టార్లలో వేరుశనగ, 15 వేల హెక్టార్లలో మొక్కజొన్నతో పాటు తెల్లకుసుమ, జొన్న తదితర పంటలను రైతులు సాగు చేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం రైతులకు సబ్సిడీపై నూనె గింజల విత్తనాలను పంపిణీ చేశారు. ఏడీఏ సత్యనారాయణ, ఏఓ రామకృష్ణుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement