జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్ కింద సాగైన 2.65 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. 1.30 లక్షల హెక్టార్ల కంది, 55 వేల హెక్టార్ల వేరుశనగ, 29 వేల హెక్టార్ల పత్తి, 16 వేల హెక్టార్ల మొక్కజొన్న, 12,500 హెక్టార్ల ఆముదం తదితర ప్రధాన పంటలతో పాటు చిన్నాచితకా పంటలు కూడా చేతికొచ్చే పరిస్థితి లేదు. కనీసం పెట్టుబడులు కూడా దక్కే అవకాశాలు లేక కొందరు రైతులు పంటలు తొలగించేశారు. కరువు మండలాలను ప్రకటించిన ప్రభుత్వం రైతులను ఆదుకోవడంతో చిత్తశుద్ధి ప్రదర్శించాలని జిల్లా రైతాంగం కోరుతున్నారు.


