ఎన్నికల అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలి

Sep 28 2026 12:53 AM | Updated on Sep 28 2026 12:53 AM

మడకశిర: దేశవ్యాప్తంగా ఎన్నికల అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడు, మాజీ మంత్రి ఎన్‌.రఘువీరారెడ్డి డిమాండ్‌ చేశారు.ఎన్నికల ప్రక్రియపై వస్తున్న అనేక ఆరోపణలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సమగ్ర విచారణ జరిపించి.. ప్రజల్లో నెలకొన్న అనుమానాలను తొలగించాల్సిన అవసరముందన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ (సీఈసీ) చర్యలు, నిర్ణయాలకు వ్యతిరేకంగా మడకశిర మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలోని గాంధీజీ విగ్రహం ఎదుట ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌ అధ్యక్షతన నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ సర్‌ ప్రక్రియ ద్వారా ఓట్లను తొలగించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలకు సీఈసీ ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్వర్‌కుమార్‌గుప్తా ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును పరిరక్షించుకునేందుకు చేసే జాతీయ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని సీఎం చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌లకు లేఖలు రాసినట్లు రఘువీరా తెలిపారు.

సీడబ్ల్యూసీ నేత ఎన్‌.రఘువీరారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement