అనంతపురం సిటీ: పట్టుదల, కష్టం తోడైతే విజయం వరిస్తుందని అనంతపురంలోని లక్ష్మీనగర్‌కు చెందిన వైద్య విద్యార్థిని డాక్టర్ గాజుల హంసలేఖ నిరూపించారు. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రకటించిన నీట్ పీజీ–2026 ఫలితాల్లో ఆమె జాతీయస్థాయిలో 7,673వ ర్యాంకు సాధించి సత్తా చాటారు. 720 మార్కులకు గాను 518 మార్కులు సాధించిన హంసలేఖ నెల్లూరులోని ఏసీఎస్‌ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. గతేడాది ఇదే నీట్ పీజీ–2025 పరీక్షలో ఆమె సోదరుడు శ్రీకృష్ణదేవరాయలు 621 మార్కులతో జాతీయ స్థాయిలో 1,330వ ర్యాంకు సాధించగా, అన్న స్ఫూర్తితో చెల్లెలు కూడా జాతీయ స్థాయి ర్యాంకు కై వసం చేసుకోవడం విశేషం.


