మీ ఓటు ఓకే ‘సర్‌’! | - | Sakshi
Sakshi News home page

మీ ఓటు ఓకే ‘సర్‌’!

Sep 23 2026 1:13 AM | Updated on Sep 23 2026 1:13 AM

అనంతపురం అర్బన్‌: స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)లో భాగంగా ఓటర్ల విచారణ ప్రక్రియ సాగుతోంది. ఎస్‌ఐఆర్‌ ప్రారంభానికి ముందు జిల్లాలో 20,38,523 ఓట్లు ఉన్నాయి. ‘సర్‌’లో భాగంగా వీరికి ఎన్యుమరేషన్‌ ఫారాలు అందజేశారు. ఈ ప్రక్రియలో 2,48,087 మంది ఓటర్లకు సంబంధించి ఎన్యుమరేషన్‌ ఫారాలు వెనక్కి రాలేదు. దీంతో ఓటర్ల ముసాయిదా జాబితాలో ఈ ఓట్లు చేర్చేలేదు. ముసాయిదా ప్రకారం జిల్లాలో 17,90,436 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులోనూ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఓట్లు, మ్యాపింగ్‌ కాని ఓట్లు 3,83,382 ఉన్నట్లు గుర్తించి అందరికీ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం విచారణ ప్రక్రియ నడుస్తోంది. అక్టోబరు 5వ తేదీన ముగుస్తుంది. అదే నెల 9వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు.

95 శాతం ఓట్లు సక్రమమే

అధికారిక లెక్కల ప్రకారం నోటీసు జారీ అయిన ఓట్లలో ఇప్పటి వరకు జరిగిన విచారణ ప్రకారం చూస్తే 95 శాతం ఓట్లు సక్రమంగా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు, ఓటు మ్యాపింగ్‌ కాలేదంటూ 3,83,382 మంది ఓటర్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. విచారణ సమయంలో ఓటర్ల నుంచి అవసరమైన ధ్రువపత్రాలను తీసుకుని పరిశీలన చేశారు. ఇప్పటి వరకు చేసిన విచారణలో 20,639 ఓట్లు మాత్రమే అనర్హమైవిగానూ 3,62,743 ఓట్లు సక్రమంగా ఉన్నట్లు నిర్ధారించారు. వీటిలో ఇప్పటి వరకు 3,41,999 ఓట్లను ఓటర్ల తుది జాబితాకు పంపించారు. మరో 20,744 ఓట్లు తుది జాబితాకు పంపించాల్సి ఉంది.

అనంతపురంలో అత్యధికం..

విచారణలో అనర్హమైనవిగా నిర్ధారించిన ఓట్లను తొలగించి ఓటర్ల తుది జాబితాను ప్రచురిస్తారు. నోటీసు జారీ అయిన 3,83,382 ఓట్లకు సంబంధించి ఇప్పటి వరకు జరిగిన విచారణలో 20,639 అనర్హమైనవిగా గుర్తించారు. ఈ ఓట్లు అత్యధికంగా అనంతపురం అర్బన్‌ నియోజకవర్గంలో 11,290 ఉన్నాయి. అత్యల్పంగా గుంతకల్లు నియోజకవర్గంలో 58 ఉన్నాయి. ఇక రాప్తాడు నియోజకవర్గం పరిధిలో 2,718, రాయదుర్గంలో 1,673 ఓట్లు, తాడిపత్రిలో 1,650 ఓట్లు, శింగనమలలో 1,525 ఓట్లు, ఉరవకొండలో 1,059 ఓట్లు, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 666 ఓట్లు ఉన్నాయి.

95 శాతం ఓట్లు సక్రమంగానే ఉన్నట్లు విచారణలో వెల్లడి

3,83,382 మంది ఓటర్లకు నోటీసుల జారీ

ఇప్పటి వరకు అనర్హులుగా తేలింది 20,639 మంది ఓటర్లే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement