అమెరికా సదస్సుకు ప్రొఫెసర్‌ సురేంద్రబాబు | - | Sakshi
Sakshi News home page

అమెరికా సదస్సుకు ప్రొఫెసర్‌ సురేంద్రబాబు

Sep 23 2026 1:13 AM | Updated on Sep 23 2026 1:13 AM

అనంతపురం న్యూటౌన్‌: అమెరికాలో నవంబర్‌లో జరిగే ఐబీఎం క్వాంటం సదస్సులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రొఫెసర్‌ నంబూరి సురేంద్రబాబు పాల్గొననున్నారు. ప్రస్తుతం ఆయన టాంజానియీ యూనివర్సిటీ ఆఫ్‌ దోదోమాలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. క్వాంటం సదస్సులో పాల్గొనే తొలి ఆంధ్రప్రదేశ్‌ వ్యక్తిగా ఘనతకెక్కారు. సురేంద్రబాబు ఎస్కే యూనివర్సిటీలో పీజీ, పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఎస్కేయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో అడహాక్‌ లెక్చరర్‌గా పనిచేసిన సురేంద్రబాబు భారత ప్రభుత్వ సమస్త ఈడీసీఐఎల్‌ ద్వారా ఎంపికై 2009 నుంచి దోదోమా యూనివర్సిటీలో ఫుల్‌టైం ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన కంప్యూటర్‌ క్వాంటం కెమిస్ట్రీలో ఆర్గానిక్‌ పాలిమర్‌ సోలార్‌ సైన్సెస్‌పై పరిశోధనలు చేశారు. ప్రస్తుతం క్వాంటం కంప్యూటర్‌ ఇన్‌ఫర్మేషన్‌ ఆధారంగా డ్రగ్‌ డిజైన్‌ మెటీరియల్‌ డిజైన్‌ రంగాలలో తన పరిశోధనలను కొనసాగిస్తున్నారు. ఈ పరిశోధనలకు గుర్తింపుగా ఈ ఏడాది నవంబర్‌ 10 నుంచి 13వ తేదీ వరకు జరిగే ఐబీఎం క్వాంటం సదస్సుకు ప్రత్యేక ఆహ్వానితుడిగా ప్రొఫెసర్‌ నంబూరి సురేంద్రబాబు హాజరుకానున్నారు. ఈయనకు తొలి ఆంధ్రప్రదేశ్‌ వ్యక్తిగా ఆహ్వానం రావడం పట్ల ఎస్కే యూనివర్సిటీకి చెందిన పలువురు ప్రొఫెసర్లు తదితరులు అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement