‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా చాటుదాం | - | Sakshi
Sakshi News home page

‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా చాటుదాం

Sep 7 2026 3:14 AM | Updated on Sep 7 2026 3:14 AM

అనంతపురం: అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజల అభ్యున్నతే అంతిమ లక్ష్యమని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సత్తా చాటుదామని పార్టీ శ్రేణులకు జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ అనుబంధ విభాగాలన్నీ దీటుగా పనిచేయాలని సూచించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో నగరంలోని 1, 2, 19, 27, 28, 29, 43, 44, 45, 46, 47, 48 డివిజన్ల యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్‌సీపీ నేతలతో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా అనంత హాజరై దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ‘జెన్‌జీ’ నడుస్తోందని, యువత అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని అన్నారు. రాష్ట్రంలో మెగా డీఎస్సీ స్పోర్ట్‌ కోటా నియామకాల్లో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. వీటికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్‌ తక్షణం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల హామీల అమలులో సీఎం చంద్రబాబు విఫలమయ్యారన్నారు. నిరుద్యోగభృతి, ఆడబిడ్డ నిధి అమలు చేయకుండా ఆయా వర్గాలను వెన్నుపోటు పొడిచారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు కొండ్రెడ్డి ఓబిరెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌ యాదవ్‌, మాజీ కార్పొరేటర్లు చంద్రమోహన్‌రెడ్డి, ఇసాక్‌, సంపంగి రామాంజినేయులు, మాలపాటి శ్రీనివాసులు, ఎస్టీ సెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు సాకే శ్రీనివాసులు, వైఎస్సార్‌సీపీ నేతలు హనుమంతు, రామచంద్ర, రాజు, నిమ్మల నాగరాజు, నారాయణరెడ్డి, అరవింద్‌, ప్రసన్న లక్ష్మి, అబ్బాస్‌, మనోజ్‌, కుమార్‌, యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు దాదాఖలందర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి లోకనాథ్‌రెడ్డి, మణిరాయల్‌, జిల్లా కార్యదర్శి హర్షవర్దన్‌, నగర అధ్యక్షుడు దత్త, ఉపాధ్యక్షుడు వినీత్‌, ఉదయ్‌, నగర ప్రధాన కార్యదర్శి మసూద్‌, మైను, నగర కార్యదర్శి రాం భూపాల్‌రెడ్డి, బబ్లూ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement