బీటీపీ కాలువ పనులు పూర్తి చేసేందుకు నిధులు తీసుకురావడంలో ఎమ్మెల్యే అమిలినేని విఫలమయ్యారు. సొంత డబ్బుతో కాలువలు తవ్వుతామని గొప్పలు చెప్పిన ఆయన.. మరి ఎందుకో పనులు ఆపేశారు. చంద్రబాబు మెప్పు కోసం కుప్పంలో పనులు చేస్తావు... కానీ ఇక్కడ ఓట్లు వేసి గెలిపించిన ప్రజల కోసం కాలువ పనులు చేయడానికి తీరక లేదా? ఆగస్టు చివరి నాటికి రైతులకు పరిహారం అందిస్తామని చెప్పిన హామీ ఏమైంది..?
– డాక్టర్ తలారి రంగయ్య, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, కళ్యాణదుర్గం


