ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న బొలెరో | - | Sakshi
Sakshi News home page

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న బొలెరో

Sep 6 2026 12:43 AM | Updated on Sep 6 2026 12:43 AM

ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు

రాయదుర్గం రూరల్‌/బెళుగుప్ప: రాయదుర్గం మండలంలోని కాశీపురం గేటు వద్ద శనివారం సాయంత్రం బొలెరో వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. బెళుగుప్ప మండలం శ్రీరంగాపురం గ్రామానికి చెందిన రామ్‌చరణ్‌, అభిరామ్‌, గోపాల్‌లు రాయదుర్గం మండలంలోని కాశీపురం గ్రామానికి ద్విచక్ర వాహనంలో వెళ్లి తిరిగి వస్తుండగా, రాయదుర్గం–అనంతపురం జాతీయ రహదారిపై బొలెరో ఢీకొంది. దీంతో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు అనంతపురం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన విద్యార్థులు గుండ్లపల్లి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై రాయదుర్గం అర్బన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తీవ్ర గాయాలపాలైన రామ్‌చరణ్‌, అభిరామ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement