చంద్రబాబు ప్రభుత్వం పీఆర్‌సీ కమిషనర్‌ను నియమించలేదు. ఐఆర్ ప్రకటించలేదు. ఐదు డీఏలు పెండింగ్‌లో ఉంచారు. సరండర్ లీవ్ ఉసేలేదు. అయినా రెండున్నర ఏళ్ల పాటు ఓపిగ్గా ఉన్నాం. ఉద్యోగుల హక్కులను కాలరాస్తే వాటిని సాధించుకునేందుకు ఉద్యమబాట పడతాం. మాకు తెలుసు. ఇప్పటి వరకు విజ్ఞప్తులు చేసిన చేతులు ఇకపై ఉద్యమ పిడికిలి బిగించి పోరాటానికి సిద్ధమవుతాయి. ఇప్పటికే కార్యవర్గం సమావేశం నిర్వహించి నాయకులకు దిశానిర్దేశం చేశాం. రాష్ట్ర కమిటీ ప్రకటించనున్న కార్యాచరణ మేరకు ఉద్యమాలను సాగిస్తాము.
– జక్కుల మాధవ్, జిల్లా చైర్మన్, ఏపీ జేఏసీ


