జిల్లా అంతటా గురువారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమైంది. పడమర దిశగా గంటకు 12 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. | - | Sakshi
Sakshi News home page

జిల్లా అంతటా గురువారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమైంది. పడమర దిశగా గంటకు 12 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.

Aug 21 2026 12:22 AM | Updated on Aug 21 2026 12:22 AM

‘సర్‌’లో నోటీసుల

జారీ పూర్తి చేస్తాం

అనంతపురం అర్బన్‌: స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)లో భాగంగా నాన్‌మ్యాపింగ్‌ ఓటర్లు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఓటర్లకు సంబంధించి నోటీసుల జారీ ప్రక్రియ పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌కు జాయింట్‌ కలెక్టర్‌ సి.విష్ణుచరణ్‌ చెప్పారు. ఎస్‌ఐఆర్‌పై సీఈఓ గురువారం వెలగపూడి నుంచి కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఎస్‌ఐఆర్‌ నిర్వహణపై సీఈఓకు ఈ సందర్భంగా జేసీ వివరించారు. నాన్‌మ్యాపింగ్‌ ఓటర్లు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఓటర్లకు సంబంధించి నోటీసులను 100 శాతం సిద్ధం చేశామన్నారు. ఇప్పటి వరకు 77 శాతం జారీ చేశామని, 23 శాతం పెండింగ్‌ ఉందన్నారు. త్వరలో జారీ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. నోటీసుల విచారణ 26 శాతం పూర్తయ్యిందని, పెండింగ్‌లో ఉన్న 74 శాతం నోటీసుల విచారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టామన్నారు. ఓటరు నమోదు (ఫారం–6), వివరాల మార్పునకు (ఫారం–8) సంబంధించి 10 వేల దరఖాస్తులకు పైగా ఉన్నాయని, వాటిని పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. పెండింగ్‌లో ఉన్న బుక్‌ ఎ కాల్‌కు సంబంధించి 38, ఎన్‌జీపీఓ సంబంధించి 8 ఫిర్యాదులను పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ మలోల, ఎన్నికల విభాగం డీటీ కనకరాజ్‌, ఎస్‌ఏ శామ్యూల్‌ బెంజిమన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement