అనంతపురం సెంట్రల్: స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహిద్దామని ఎస్పీ జగదీష్ పిలుపునిచ్చారు. పోలీసు పరేడ్ మైదానంలో ఆగస్టు 15న జరగనున్న స్వాతంత్య్ర వేడుకలకు సంబంధించి రిహార్సల్స్ గురువారం నిర్వహించారు. ఎస్పీ జగదీష్ జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం వాహనంలో సాయుధ బలగాల పరేడ్‌ను పరిశీలించారు. వేడుకల ప్రారంభం నుంచి ముగిసే వరకూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా, ఏఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వరెడ్డి, ఆర్‌ఐలు పవన్ కుమార్, మధు తదితరులు పాల్గొన్నారు.


