పెళ్లి కాలేదని యువకుడి బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

పెళ్లి కాలేదని యువకుడి బలవన్మరణం

Aug 12 2026 12:52 AM | Updated on Aug 12 2026 12:52 AM

పెద్దపప్పూరు: ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కుదరకపోవడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన పెద్దపప్పూరు మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ చంద్రశేఖర్‌ రెడ్డి తెలిపిన మేరకు.. మండలంలోని నామనాంకపల్లికి చెందిన నాగిరెడ్డి, కాంతమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు సంతానం. చిన్న కుమారుడు విజయ్‌కుమార్‌ రెడ్డి (31) ఓ ప్రైవేటు బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. కొన్ని రోజుల నుంచి తల్లిదండ్రులు విజయ్‌కుమార్‌రెడ్డికి సంబంధాలు చూస్తున్నా పెళ్లి కుదరలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆయన మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. మృతదేహాన్ని తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆస్పత్రికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ మేరకు ఎస్‌ఐ చంద్రశేఖర్‌ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఎమ్మెల్సీ బృందాన్ని కలిసిన వైఎస్సార్‌ టీఏ నాయకులు

పుట్టపర్తి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో పలు సమస్యలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించడానికి వెళ్తున్న ఎమ్మెల్సీ బృందాన్ని వైఎస్సార్‌టీఏ నాయకులు మంగళ వారం తిరుపతిలో కలిశారు. ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, కల్పలతారెడ్డికి ఉపాధ్యాయ సమస్యలను విన్నవించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌టీఏ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు అశోక్‌కుమార్‌రెడ్డి, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల అధ్యక్షులు పీవీ రమణారెడ్డి, నాగిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటరమణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement