పంటలకు వన్యప్రాణుల బెడద | - | Sakshi
Sakshi News home page

పంటలకు వన్యప్రాణుల బెడద

Aug 12 2026 12:52 AM | Updated on Aug 12 2026 12:52 AM

పొలాల్లో కలియదిరుగుతున్న వైనం

వజ్రకరూరు: వన్యప్రాణులు పొలాల్లోకి చొరబడుతున్నాయి. పంటలను పెకలించి తినేస్తున్నాయి. దీంతో రైతులకు కంటిమీద కునుకులేకుండా పోతోంది. ప్రస్తుత ఖరీఫ్‌లో మండలంలో ప్రధానంగా కంది, వేరుశనగ, సజ్జ, జొన్న, మొక్కజొన్న, వరి, ఆముదం, ప్రొద్దుతిరుగుడు తదితర పంటలు సాగు చేశారు. ఇందులో అధికారిక లెక్కల ప్రకారం 12 వేల హెక్టార్లలో కంది, 300 హెక్టార్లలో వేరుశనగ సాగైనట్లు తెలుస్తోంది. వజ్రకరూరు, కమలపాడు, గూళ్యపాళ్యం, గంజికుంట, తట్రకల్లు, పందికుంట, రాగులపాడు, కడమలకుంట, పీసీ ప్యాపిలి గ్రామాల పొలాల్లోకి జింకలు, కుందేళ్లు, అడవిపందులు తదితర జంతువులు చొరబడుతున్నాయి. పంటలను పెకలించి తింటున్నాయి.

కంది పంటను తినేశాయి

నేను పది ఎకరాల్లో కంది పంట సాగు చేశాను. పగలంతా పంటకు కాపలా ఉంటున్నాయి. రాత్రిళ్లు అయితే చాలు జింకలు, కుందేళ్లు, అడవి పందులు చొరబడుతున్నాయి. పంటనంతా తినేయడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. వన్యప్రాణుల నుంచి పంటలను కాపాడేందుకు అధికారులు చొరవ చూపాలి. – కూర్మన్న, రైతు, కమలపాడు

మా కష్టాలు ఎవరికి చెప్పాలో..?

నాకున్న నాలుగు ఎకరాల్లో కంది సాగుచేశా. ఎకరాకు 10 నుంచి 15 వేల రూపాయలు పెట్టుబడి పెట్టా. జింకల దాడితో పంట మొత్తం దెబ్బతింది. జింకలతో పాటు కుందేళ్లు, అడవి పందుల సంచారంతో పంటలన్నీ దెబ్బతింటున్నాయి. మాకష్టాలు ఎవ రికిచెప్పాలో అర్థంకావడంలేదు. కలెక్టర్‌ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి.

– శ్రీనివాసులు, రైతు, కమలపాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement