ఉరవకొండ: జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన ఉరవకొండలోని ఉరగాద్రి చౌడేశ్వరీ అమ్మవారి ఆలయంలో ఈనెల 12న జరిగే జయంతి ఉత్సవ పొస్టర్లను ఆదివారం అమ్మవారి ఆలయ ఆవరణలో కమిటీ సభ్యులు విడుదల చేశారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ కొత్త శరత్ విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన ఉరగాద్రి చౌడేశ్వరీ అమ్మవారి ఆలయంలో ఈనెల 12న ఆషాడ మాసపు అమావాస్యను పురస్కరించుకోని అమ్మవారి జయంతిని అట్టహాసంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి దర్శనానికి తరలివచ్చే వారికి అన్నదానం కూడా చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
చెకుముకి సంబరాలను
జయప్రదం చేయండి
అనంతపురం కల్చరల్: చిన్నారుల్లో విజ్ఞాన పిపాసను రగిలించే చెకుముకి సైన్సు సంబరాలను జయప్రదం చేయాలని జేవీవీ రాష్ట్ర కమిటీ సభ్యుడు సాకే భాస్కర్ అన్నారు. ఆదివారం స్థానిక సంఘమేష్ నగర్‌లోని జనవిజ్ఞాన వేదిక కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగు దశాబ్దాలుగా విద్యార్థులో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంచే దిశగా జేవీవీ పనిచేస్తోందన్నారు. సృజనాత్మకత, సైన్స్‌పై విస్తృత అవగాహన, ఆసక్తి మరింత పెరగాలన్నారు. ఈ ఏడాది 4 లక్షలకు పైగా విద్యార్థులు చెకుముకి సంబరాల్లో పాల్గొంటున్నట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా 30 మండలాల్లో నిర్వహిస్తున్నట్లు జేవీవీ ప్రధాన కార్యదర్శి కె.వీరరాజు తెలిపారు. జిల్లా స్థాయి విజేతలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామన్నారు. కార్యక్రమంలో గాంగేనాయక్, మహమ్మద్ జిలాన్, రామిరెడ్డి శ్రీనివాసరావు, నాగరత్నమ్మ, శశికళ తదితరులు పాల్గొన్నారు.


