మళ్లీ ఒక్కటైన దంపతులు | - | Sakshi
Sakshi News home page

మళ్లీ ఒక్కటైన దంపతులు

Aug 10 2026 1:04 AM | Updated on Aug 10 2026 1:04 AM

ధర్మవరం అర్బన్‌/ముదిగుబ్బ: విడాకులు తీసుకున్న దంపతులను డీఎస్పీ జగన్నాథ్‌రాజు కౌన్సెలింగ్‌ ఇచ్చి మళ్లీ ఒక్కటి చేశారు. ధర్మవరం డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం విడిపోయిన భార్యాభర్తలకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. వివరాలు... పట్నం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నాగారెడ్డిపల్లికి చెందిన అశ్విని, ఆమె భర్త శ్రీనివాసులుకు రెండేళ్ల క్రితం వివాహమైంది. అయితే విభేదాల కారణంగా ఏడాది క్రితం వారు విడాకులు తీసుకున్నారు. ఇటీవల నాగారెడ్డిపల్లిలో పర్యటించిన డీఎస్పీకి అశ్విని కుటుంబ సమస్యలపై విన్నవించింది. ఈ నేపథ్యంలో శ్రీనివాసులుతో పాటు వారి కుటుంబ సభ్యులతో డీఎస్పీ మాట్లాడారు. అందరినీ డీఎస్పీ కార్యాలయానికి పిలిపించారు. శ్రీనివాసులు తన భార్య అశ్వినితో సఖ్యతగా కుటుంబ జీవితాన్ని కొనసాగించేందుకు అంగీకరించారు. డీఎస్పీ ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో దంపతులను తిరిగి ఒక్కటిగా చేశారు. దీంతో అశ్విని, శ్రీనివాసులుతో పాటు వారి బంధువులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

విభేదాలతో ఏడాది క్రితం విడాకులు తీసుకున్న అశ్విని, శ్రీనివాసులు

పోలీసుల కౌన్సెలింగ్‌తో కలిసి జీవించేందుకు అంగీకారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement