మహిళ మెడలో చైన్‌ అపహరణ | - | Sakshi
Sakshi News home page

మహిళ మెడలో చైన్‌ అపహరణ

Aug 9 2026 2:10 AM | Updated on Aug 9 2026 2:10 AM

గుత్తి: గుత్తిలో శనివారం పట్టపగలే చైన్‌ స్నాచర్లు రెచ్చిపోయారు. జంగాల కాలనీకి చెందిన రజని ఇంటి వద్ద స్నేహితులతో మాట్లాడుతున్న సమయంలో ఇద్దరు దుండగులు బైక్‌లో వేగంగా వచ్చారు. రజని వద్ద బైక్‌ స్లో చేశారు. వెంటనే అందులో ఒకడు ఆమె మెడలోని మూడున్నర తులాల బంగారు చైన్‌ లాక్కుని, ఒక్క ఉదుటన అక్కడి నుంచి బైక్‌లో పరారయ్యారు. పట్టపగలు, అదీ ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతంలో మహిళ మెడలోని బంగారు చైన్‌ లాక్కెళ్లడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. చైన్‌ స్నాచింగ్‌ దృశ్యాలు ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డు అయ్యాయి. ఇద్దరు దొంగల్లో ఒకడు హెల్మెట్‌, మరొకరు మాస్క్‌ ధరించి బైక్‌లో వచ్చారు. చైన్‌ లాక్కొని తాడిపత్రి రోడ్డు పైపు వేగంగా వెళ్లిపోయారు. సీసీ ఫుటేజీ ఆధారంగా సీఐ రామారావు, పోలీసు సిబ్బంది దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ ఫుటేజీని అన్ని పోలీసు స్టేషన్లకు పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement