మహిళలపై వేధింపులను నివారిద్దాం | - | Sakshi
Sakshi News home page

మహిళలపై వేధింపులను నివారిద్దాం

Aug 5 2026 1:59 AM | Updated on Aug 5 2026 1:59 AM

రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాయపాటి శైలజ

అనంతపురం: మహిళలపై వేధింపుల నివారణను సామాజిక బాధ్యతగా తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ రాయపాటి శైలజ అన్నారు. మంగళవారం ఎస్కేయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో జాతీయ మహిళా కమిషన్‌ సహకారంతో నిర్వహించిన విద్యార్థినుల అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలపై వేధింపులకు పాల్పడడం చట్టరీత్యా నేరమన్నారు. బాధితులు వీలైనంత త్వరగా పోలీసులు లేదా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్‌ ఎన్‌వీఆర్‌ జ్యోతి కుమార్‌, అనంతపురం పీటీసీ ప్రిన్సిపాల్‌ సుప్రజ, సీనియర్‌ ఏపీపీ ఎన్‌.సి.సంగీత, మానసిక నిపుణులు డాక్టర్‌ సురేఖ, ఉమెన్‌ కమిషన్‌ సలహాదారు సూయాజ్‌, ఐసీడీఎస్‌ పీడీ సాజిదా బేగం, క్యాంపస్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement