అనంతపురం నగర శివారులోని హెచ్చెల్సీ అధ్వానంగా మారింది. తపోవనం బ్రిడ్జి నుంచి గుత్తి రోడ్డు వరకు రెండువైపులా పెచ్చులూడిపోయాయి. బండ రాళ్లు బయటికి తేలుతున్నాయి. కెనాల్‌కు నీరు వదిలినప్పుడు గుంతల ద్వారా చుట్టుపక్కల కాలనీలోకి ప్రవహించే ప్రమాదం ఉంది. ఇక.. హెచ్చెల్సీలో అండర్ బ్రిడ్జిలు కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. కాలువకు ఇరువైపులా ముళ్ల చెట్లు ఏపుగా పెరిగాయి. అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం
పెచ్చులూడిన కాలువపై దిమ్మెలు కాలువలో ఏపుగా పెరిగిన కంప చెట్లు కాలువ గట్టు దెబ్బతిన్న దృశ్యం


