నార్పల: మండల పరిధిలోని ముచ్చుకుంటపల్లికి చెందిన రైతు ఏ.గోపాల్‌రెడ్డి (60) బావిలో పడి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు.. బుధవారం గోపాల్‌రెడ్డి తన పొలం వద్దకు బయలుదేరాడు. మార్గమధ్యంలోని బావిలోకి ప్రమాదవశాత్తు పడిపోయాడు. స్థానికులు అప్రమత్తమై బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు.
మహిళపై అత్యాచార యత్నం
గుంతకల్లు రూరల్: మండల పరిధిలోని మొలకలపెంట గ్రామానికి చెందిన దండు వెంకటేశులు అదే గ్రామానికి చెందిన ఓ మహిళపై అత్యాచార యత్నం చేశాడు. కసాపురం ఎస్‌ఐ టీపీ వెంకటస్వామి తెలిపిన మేరకు.. మొలకలపెంటకు చెందిన మహిళకు పది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నిరోజులుగా ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టినింట్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. మంగళవారం సాయంత్రం ఒంటరిగా ఉన్న ఆమైపె కన్నేసిన దండు వెంకటేశులు ఇంట్లోకి దూరి అత్యాచారం చేసేందుకు యత్నించాడు. బాధిత మహిళ కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు తన తల్లిదండ్రులతో కలిసి బుధవారం కసాపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆర్మీ మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
అనంతపురం సెంట్రల్: ఆర్మీ మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు అరెస్ట్ చేశారు. బుధవారం నగరంలోని గుల్జార్‌పేట ఎకై ్సజ్ కార్యాలయంలో సీఐ సత్యనారాయణ వివరాలు వెల్లడించారు. అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి పంచాయతీ బీజేపీ కాలనీ చెందిన బోగే నరేష్‌బాబు ఆర్మీ క్యాంటీన్‌లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేసేవాడు. ఇతను 15 ఆర్మీ మద్యం బాటిళ్లను తరలిస్తున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి రామ్మోహన్‌రెడ్డికి సమచారం అందింది. ఈ క్రమంలోనే ఆయన ఆదేశాల మేరకు ఎకై ్సజ్ పోలీసులు దాడులు నిర్వహించి కక్కలపల్లి టమాట మండీ సమీపంలో నరేష్‌బాబును పట్టుకున్నారు. మాజీ సైనికుల నుంచి మద్యం బాటిళ్లు సేకరించిన అనంతరం బయటి వ్యక్తులకు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు విచారణలో తేలింది. ఎకై ్సజ్ చట్టం ప్రకారం నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆర్మీ మద్యం అక్రమ కొనుగోలు, రవాణ, నిల్వ, విక్రయం నేరమని, ఎక్కడైనా ఇలాంటి కార్యకలాపాలు జరుగుతుంటే ఎకై ్సజ్ అధికారులకు సమాచారం ఇవాలని సీఐ కోరారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ ఎస్‌ఐలు జయనరసింహ, జాకిర్ హుస్సేన్, కృష్ణారెడ్డి, రాజేంద్రప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు.


