ముమ్మాటికీ మోసమే | - | Sakshi
Sakshi News home page

ముమ్మాటికీ మోసమే

Aug 4 2026 12:17 AM | Updated on Aug 4 2026 12:17 AM

అనంతపురం: ‘మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను నిలువునా మోసగించారు. అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలి. డీఎస్సీ–2025 దేశంలోనే అతిపెద్ద కుంభకోణం. మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలి’ అని మేధావులు డిమాండ్‌ చేశారు. సోమవారం నగరంలోని వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి మేధావులు, రిటైర్డ్‌ ప్రిన్సిపాళ్లు, విద్యార్థులు, డీఎస్సీ అభ్యర్థులు భారీగా హాజరయ్యారు. ముందుగా వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు సూపర్‌ సిక్స్‌తో పాటు అనేక హామీలను గుప్పించారని గుర్తు చేశారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, లేనిపక్షంలో ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మాట తప్పారన్నారు. మెగా డీఎస్సీ పేరుతో అవకతవకలకు పాల్పడి అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారని విమర్శించారు. వీటన్నిటికి బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ వెంటనే రాజీనామా చేయాలని, ఆయన రాజీనామా చేయని పక్షంలో మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. డీఎస్సీ అవకతవకలపై సీబీఐతో విచారణ చేయించాలన్నారు. నిరుద్యోగులకు భృతి ఇవ్వడంతో పాటు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. చంద్రబాబు ప్రభుత్వ అన్యాయాలను నిరసిస్తూ వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 6,7,8,9 తేదీల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రిలే నిరాహార దీక్షలతో పాటు 10వ తేదీన నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ శ్రేణులతో పాటు మేధావులు, విద్యావంతులు, యువతీ యువకులు, విద్యార్థులు, రాజకీయాలకు అతీతంగా ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మంగమ్మ, సీఈసీ సభ్యుడు నదీం అహమ్మద్‌, ఎస్‌ఈసీ సభ్యుడు కోగటం విజయభాస్కర్‌ రెడ్డి, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వీర రామకృష్ణా రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి ప్రకాష్‌ రెడ్డి, మాజీ మేయర్‌ వసీం, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్‌, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌ యాదవ్‌, మద్దిరెడ్డి నరేంద్ర రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్‌ దాసరి వాసంతి సాహిత్య, జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆలమూరు శ్రీనివాస రెడ్డి, గౌని నాగన్న, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్‌మోహన్‌ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివా రెడ్డి, జానీ, పంచాయతీరాజ్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రా రెడ్డి, మొఘల్‌ సైఫుల్లా భేగ్‌, మల్లెమీద నరసింహులు, కట్టుబడి తానీషా, కొర్రపాడు హుస్సేన్‌ పీరా, ఓబిరెడ్డి, అనిల్‌ కుమార్‌ గౌడ్‌, కాగజ్‌ఘర్‌ రిజ్వాన్‌, ఫయాజ్‌, దాదా ఖలందర్‌, వేముల నదీం, బాకే హబీబుల్లా, ఎద్దుల అమర్‌నాథ రెడ్డి, సాకే అశోక్‌కుమార్‌, సాకే కుళ్లాయిస్వామి, రామకృష్ణ, కుళ్లాయప్ప, రాధా యాదవ్‌, సాకే చంద్రలేఖ, హిమబిందు, భారతి, అంజలి, శోభారాణి, శోభా భాయి, మహేశ్వరి, ప్రసన్న, హజరాబి, లీల, ఖమర్తాజ్‌, లక్ష్మీనరసమ్మ, చంద్రకళ పాల్గొన్నారు.

దేశంలోనే అతిపెద్ద కుంభకోణం డీఎస్సీ–2025

తక్షణమే సీబీఐతో విచారణ చేయించాలి

అక్రమాలకు బాధ్యత వహిస్తూ

లోకేష్‌ రాజీనామా చేయాలి

రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు

రిలే నిరాహార దీక్షలతో నిలదీద్దాం: వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత

నియోజకవర్గాల్లోనూ సమావేశాలు..

డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని మాజీ మంత్రి డాక్టర్‌ సాకే శైలజానాథ్‌ డిమాండ్‌ చేశారు. శింగనమలలోని వాసవీ కల్యాణమండపంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తప్పు చేయకుంటే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ఆయన ప్రశ్నించారు.

తాడిపత్రిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ పరీక్షల్లో భారీగా అక్రమాలు జరిగాయన్నారు. మంత్రివర్గం నుంచి లోకేష్‌ను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

వైఎస్సార్‌ సీపీ రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవింద రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. డీఎస్సీ అక్రమాలపై ఉద్యమాలకు సిద్ధం కావాలని మెట్టు పిలుపునిచ్చారు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని స్పష్టం చేశారు.

బాబుకు మోసం అలవాటై పోయింది

నిరుద్యోగులను వంచించడం చంద్రబాబు ప్రభుత్వానికి అలవాటైపోయింది. 2014లోనూ నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారు. 2024లోనూ అదే పరిస్థితి ఎదురైంది. డీఎస్సీ అవకతకలపై సీబీఐతో విచారణ జరిపించాలి. ఇప్పటి దాకా డిగ్రీ అడ్మిషన్లు చేపట్టకపోవడం దారుణం.

– డాక్టర్‌ శంకరయ్య, కేఎస్‌ఎన్‌ డిగ్రీ కళాశాల మాజీ ప్రిన్సిపాల్‌

ఇక్కడా ఉద్యమం తథ్యం

గతంలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే 1.20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది. చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ ఉద్యోగాల్లో సగం భర్తీ చేస్తే చాలు. డీఎస్సీఅక్రమాలపై పోరాడుతున్న వైఎస్సార్‌ సీపీ పక్షాన విద్యార్థులు ఉన్నారు. రాష్ట్రంలోనూ మరో కాక్రోచ్‌ జనతా పార్టీ ఉద్యమం తథ్యం.

– సురేష్‌ యాదవ్‌, ఎస్కేయూ ఐక్య

విద్యార్థి సంఘం నాయకుడు

వైఎస్సార్‌ సీపీ పోరాటాలకు మద్దతు

యువత భవిష్యత్తుతో చెలగాటమాడడం బాధాకరం. డీఎస్సీలో ఎస్సీ,ఎస్టీ, బీసీ వర్గాలకు అన్యాయం జరి గింది. మెరిట్‌ ఉన్న అభ్యర్థులకూ ఉద్యోగాలు రాకపోవడం అన్యాయం. డీఎస్సీలో అర్హులై అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌ సీపీ చేస్తున్న పోరాటాలకు మద్దతిస్తాం.

– సాకే హరి, ఎస్సీ, ఎస్టీ సంఘాల

జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement