అనంతపురం క్రైం: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని ఏపీపీటీడీ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. జేఏసీ పిలుపు మేరకు సోమవారం అనంతపురం కలెక్టర్ కార్యాలయం వద్దకు ఆర్టీసీ ఉద్యోగులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఉద్యోగుల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ ఆనంద్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంపించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని, ప్రభుత్వంలో విలీనం అనంతరం రావాల్సిన ప్రయోజనాలను అందజేయాలని కోరారు. కార్యక్రమంలో ఎన్‌ఎంయూఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాస్కర్ నాయుడు, జిల్లా జేఏసీ కన్వీనర్లు వి.సూరిబాబు, టి.ప్రతాప్ నారాయణ, కె.కొండయ్య, రెడ్డి, రత్నం, ఆర్‌ఎన్ రెడ్డి, బి.సోమశేఖర్, ఖాన్, కేజే ప్రకాష్, ఎం.శ్రీనివాసులు, ఎం.నారాయణస్వామి, కేఎం నాయక్, మనోజ్, సి. శ్రీరాములు, పరమేష్, మల్లికార్జున, సి.సుందర్‌రాజు తదితరులు పాల్గొన్నారు.


