100 చౌకదుకాణాల్లో ‘మీ మార్ట్‌’ | - | Sakshi
Sakshi News home page

100 చౌకదుకాణాల్లో ‘మీ మార్ట్‌’

Jul 30 2026 12:09 AM | Updated on Jul 30 2026 12:09 AM

జేీసీ విష్ణుచరణ్‌

అనంతపురం అర్బన్‌: జిల్లావ్యాప్తంగా 100 చౌకధరల దుకాణాల్లో ‘మీ మార్ట్‌’ పథకం ప్రారంభించనున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ సి.విష్ణు చరణ్‌ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో డీఎస్‌ఓ శోభారాణితో కలిసి చౌక దుకాణాల డీలర్లు, సీఎస్‌డీటీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవసరమైన వారికి రుణ సదుపాయం కల్పిస్తారన్నారు. రుణం అవసరం లేని వారు సొంతంగానైనా మార్ట్‌ ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. రేషన్‌ సరుకులతో పాటు ఇతర నిత్యావసర సరుకులను రిటైల్‌ మార్జిన్‌ ద్వారా విక్రయించవచ్చన్నారు. రేషన్‌ పంపిణీలో ఎలాంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని చెప్పారు. మీ మార్టు ప్రారంభించే డీలర్లకు ప్రాంటియర్‌ సంస్థ లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌, మేరి సహేలి అప్లికేషన్‌లో క్రియేట్‌ చేసి ఇస్తుందన్నారు. దీని ద్వారా వినియోగదారులు రేషన్‌తో పాటు వారికి అవసరమైన నిత్యావసర వస్తువులను ఒకేచోట కొనుగోలు చేసుకునే వీలు కలుగుతుందన్నారు. కంపెనీల ప్రతినిధులతో సమన్వయం చేసుకుని పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. సమావేశంలో సీఎస్‌డీటీలు, డీలర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement