అనంతపురం రూరల్ పరిధిలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. కొండలు, గుట్టలను పిండిచేస్తూ రోజూ పదుల సంఖ్యలో టిప్పర్లతో ఎర్రమట్టిని దోపిడీ చేస్తోంది. రియల్ ఎస్టేట్ వెంచర్లు, నిర్మాణ పనులకు తరలిస్తూ భారీమొత్తంలో సొమ్ము చేసుకుంటోంది. ఈ మాఫియాకు అధికార పార్టీ నేతల అండదండలు, అధికారుల సహకారం ఉండడంతో అడ్డూ అదుపు లేకుండా చెలరేగిపోతోంది. అనంతపురం రూరల్ మండలం నరసనాయనకుంట సమీపాన కొండను తవ్వి అక్రమంగా మట్టి తరలిస్తున్న దృశ్యాలివీ.
– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం.


