అనంతపురం సెంట్రల్: ఉత్తర టెక్సాస్‌లో ఈనెల 26న జరగనున్న అంతర్జాల సాహిత్య సదస్సుకు జిల్లాకు చెందిన ఏపీ అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడు, సుప్రసిద్ధ సాహితీ విమర్శకులు ఆచార్య రాచపాలెం చంద్రశేఖరరెడ్డి హాజరుకానున్నారు. ‘తెలుగు సాహిత్య విమర్శ నాడు–నేడు’ అనే అంశంపై ఆయన ప్రసంగించనున్నట్లు ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షుడు మాధవి లోకిరెడ్డి, సమన్వయకర్త దయాకర్‌మాడ తెలిపారు. ప్రతినెలా తెలుగు వెన్నెల పేరుతో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం సాహిత్య వేదిక ఆధ్వర్యంలో వెబ్‌నార్ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు.


