‘మెగా పీటీఎం’ నిర్వహణకు రూ.52.11 లక్షల విడుదల | - | Sakshi
Sakshi News home page

‘మెగా పీటీఎం’ నిర్వహణకు రూ.52.11 లక్షల విడుదల

Jul 23 2026 1:48 AM | Updated on Jul 23 2026 1:48 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 24న (శుక్రవారం) నిర్వహించనున్న మెగా పీటీఎం–4.0 కార్యక్రమం కోసం ప్రభుత్వం సమగ్ర శిక్ష ద్వారా అనంతపురం జిల్లాలోని 1,752 ప్రభుత్వ పాఠశాలలకు రూ.52,11,450 విడుదల చేసింది. ఈ మేరకు జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయం నుంచి బుధవారం ఆయా మండల విద్యాశాఖ అధికారులకు (ఎంఈఓలు) నిధులు విడుదల చేసినట్లు సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ టి. శైలజ తెలిపారు.

గంజాయి కేసులో

నిందితుడి అరెస్టు

రాప్తాడు రూరల్‌: గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడిని రాప్తాడు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. రాప్తాడు పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన క్రైం నం.62/2026 కేసులో పరారీలో ఉన్న అనంతపురం రూరల్‌ తపోవనంకు చెందిన అరుణ్‌ జాకబ్‌ అలియాస్‌ అరుణ్‌ రాస్తాను రాప్తాడు సమీపంలోని జాతీయ రహదారిపై బ్రిడ్జి వద్ద అరెస్టు చేశారు. వివరాలను సీఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి డ్రగ్స్‌ వినియోగానికి ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. యువత గంజాయి, డ్రగ్స్‌తో పాటు ఇతర మత్తు పదార్థాలు, హానికరమైన వ్యసనాలకు దూరంగా ఉండాలని సీఐ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement