వెనక్కిరాని ఈఎఫ్‌లు 2.21 లక్షలు:కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

వెనక్కిరాని ఈఎఫ్‌లు 2.21 లక్షలు:కలెక్టర్‌

Jul 21 2026 12:35 AM | Updated on Jul 21 2026 12:35 AM

అనంతపురం అర్బన్‌: ‘‘జిల్లాలో 20,38,523 మంది ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు 18,16,652 ఎన్యుమరేషన్‌ ఫారాలు (ఈఎఫ్‌లు) డిజిటలైజేషన్‌ చేశారు. వెనక్కిరాని ఈఎఫ్‌లు 2,21,871 ఉన్నాయి. 16,35,329 మ్యాపింగ్‌ చేశారు. ఇంకా 1,81,204 మ్యాపింగ్‌ కానివి ఉన్నాయి’’ అని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఓ.ఆనంద్‌ రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)పై కలెక్టర్‌ సోమవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో డీఆర్‌ఓ ఎ.మలోలతో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ ఏఎస్‌డీడీ (ఆబ్సెంట్‌, షిఫ్టెడ్‌, డెత్‌, డబుల్‌) ఓట్లు 31,916 ఉన్నామన్నారు. వీటిల్లో వాస్తవంగా ఉండి తదుపరి చర్య అవసరం లేని ఓట్లు 7,233 ఉన్నట్లు గుర్తించామని, మిగిలిన 24,666 అన్‌కలెక్టబుల్‌గా నిర్ధరించామన్నారు. ఈనెల 24 వరకు బీఎల్‌ఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి మ్యాపింగ్‌ చేస్తారని, రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని సూచించారు. సమావేశంలో ఎన్నికల డీటీ కనకరాజ్‌, ఎస్‌ఏ శామ్యూల్‌ బెంజిమన్‌, వైఎస్సార్‌సీపీ ప్రతినిధులు సోమశేఖర్‌రెడ్డి, అమర్నాథ్‌రెడ్డి, టీడీపీ నారాయస్వామి, బీజేపీ శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement