ఉరవకొండ: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఆస్మిత ఖేలో ఇండియా ఉమెన్స్ లీగ్ జిల్లా స్థాయి బాలికల సబ్ జూనియర్స్, జూనియర్స్ విభాగాల్లో నిర్వహించిన సెపక్‌తక్రా పోటీలు సోమవారం విజయవంతంగా ముగిశాయి. స్థానిక జిల్లా పరిషత్ సెంట్రల్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జరిగిన పోటీల్లో జిల్లా వ్యాప్తంగా 15 జట్లు పాల్గొన్నాయి. సబ్ జూనియర్స్ విభాగంలో కరకముక్కల జడ్పీ స్కూల్ ప్రథమ స్థానాన్ని, కొట్టాలపల్లి జడ్పీ స్కూల్ ద్వితీయస్థానాన్ని, నింబగల్లు జడ్పీ హైస్కూల్ తృతీయ స్థానాన్ని దక్కించుకున్నాయి. అలాగే జూనియర్స్ విభాగంలో కేజీబీవీ తట్రకల్లు ప్రథమస్థానంలో, ఉరవకొండ బాలికల జట్టు ద్వితీయ స్థానంలో, కొట్టాలపల్లి బాలికల జట్టు తృతీయ స్థానంలో నిలిచాయి. విజేతలకు పాఠశాల ప్రథానోపాధ్యాయులు ఖాదర్‌బాషా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు, పరిశీలకులు కార్తికేయన్, జిల్లా క్రీడా సంఘం అధ్యక్షుడు షాహిన్, సీనియర్ మారుతీప్రసాద్‌ల చేతుల మీదుగా బహుమతులు అందించారు.


