వరుణుడి కరుణ కోసం గాడిదలకు పెళ్లి | - | Sakshi
Sakshi News home page

వరుణుడి కరుణ కోసం గాడిదలకు పెళ్లి

Jul 20 2026 1:14 AM | Updated on Jul 20 2026 1:14 AM

ఆత్మకూరు: మండలంలోని సిద్దరాంపురంలో గాడిదలకు పెళ్లి చేసి గ్రామంలో ఊరేగించారు. వాసుదేవుడిగా భావించే ప్రజలు.. రెండు గాడిదలకు సంప్రదాయబద్ధంగా పూలమాలలు వేసి పెళ్లి తంతు జరిపించారు. గత నెలలో కురిసిన వర్షాలకు పొలాల్లో విత్తనాలు వేసి రైతులు ఎదురుచూస్తున్నారు. వారాలు గడుస్తున్నా ఇంత వరకూ సరైన వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన చేస్తున్నారు. గాడిదలకు పెళ్లి జరిపిస్తే వర్షాలు కురుస్తాయని ప్రజలు విశ్వసిస్తున్నారు.

నేడు డయల్‌ యువర్‌

ఎస్పీడీసీఎల్‌ సీఎండీ

అనంతపురం టౌన్‌: విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డయల్‌ యువర్‌ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సీఎండీ శివశంకర్‌ లోతేటి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యుత్‌ సమస్యలున్న వినియోగదారులు మొబైల్‌: 8977716661 నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.

జిల్లాలో డయల్‌ యువర్‌ ఎస్‌ఈ: అనంతపురం జిల్లాలో డయల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమాన్ని ఉదయం 8.30 గంటల నుంచి 9.30గంటల వరకు నిర్వహిస్తున్నట్లు విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ శేషాద్రి శేఖర్‌ తెలిపారు. వినియోగదారులు ఫోన్‌ నంబర్లు 08554–272943, 9154790350లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.

ఏఈఈ పోస్టులకు నేటిలోపు దరఖాస్తు చేసుకోండి

అనంతపురం టౌన్‌: విద్యుత్‌ శాఖలో ఖాళీగా ఉన్న ఏఈఈ (అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌) పోస్టుల దరఖాస్తుకు సోమవారం ఆఖరు రోజు అని ఏపీ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ శివశంకర్‌ లోతేటి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్పీడీసీఎల్‌ సంస్థలో ఏఈ పోస్టులు 56, టెలికాం 1, సివిల్‌ ఇంజినీర్లు 3, మొత్తం కలిపి 60 పోస్టుల నియామకానికి సంస్థ శ్రీకారం చుట్టిందన్నారు. పోస్టుల భర్తీ పక్రియ షెడ్యూల్‌ మేరకే జరుగుతుందన్నారు. ఈనెల 20వతేదీ సాయంత్రంలోపు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆగస్టు 22 నుంచి 29వ తేదీ వరకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

కొత్త నిబంధనలు

ఉపసంహరించాలి

అనంతపురం ఎడ్యుకేషన్‌: ప్రభుత్వం ఇటీవల ప్రైవేట్‌ పాఠశాలలకు అమలు చేస్తున్న కొత్త నిబంధనలను ఉపసంహరించుకోవాలని ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రైవేట్‌ పాఠశాలల సంఘం డిమాండ్‌ చేసింది. ఆదివారం స్థానిక ఉపాధ్యాయ భవన్‌లో ఉమ్మడి జిల్లా ప్రైవేట్‌ పాఠశాలల సంఘం ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. వక్తలు మాట్లాడుతూ కొత్త నిబంధనలతో బడ్జెట్‌ ప్రైవేట్‌ పాఠశాలలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా షెడ్లలో నిర్వహిస్తున్న పాఠశాలలు, గతంలో నిర్మించిన భవనాలు ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలకనుగుణంగా లేవన్న కారణంతో గుర్తింపు పునరుద్ధరణ (రెన్యూవల్‌) నిరాకరించడం సరికాదన్నారు. గదుల పరిమాణాన్ని ప్రస్తుత ప్రమాణాల ప్రకారం చూపుతూ రెన్యూవల్‌ నిలిపివేయడంతో అనేక పాఠశాలలు మూతపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. సంఘం ఉమ్మడి అనంతపురం జిల్లా సీఆర్‌ఓ కోటిరెడ్డి రవిచంద్రారెడ్డి, అనంతపురం జిల్లా అధ్యక్షుడు గంగాధర్‌ యాదవ్‌, శ్రీ సత్యసాయి జిల్లా గౌరవ అధ్యక్షులు శ్రీనివాసులు, సింగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు పలవల అనిల్‌ కుమార్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సాయి గీత, కరెస్పాండెంట్లు పాల్గొన్నారు.

గంజాయి రవాణాదారుల అరెస్టు

ఎర్రగుంట్ల: గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి నుంచి 150 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వైఎస్సార్‌ కడప జిల్లా ఎర్రగుంట్ల సీఐ విశ్వనాథరెడ్డి తెలిపారు. అదివారం ఆయన విలేకరులకు వివరాలు తెలియజేశారు. ఎస్పీ నచికేత్‌ విశ్వనాఽథ్‌, జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు ఎర్రగుంట్ల వై జంక్షన్‌లో వాహనాలు తనిఖీ చేస్తుండగా, అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు పట్టుబడ్డారు. వారిలో పొద్దుటూరుకు చెందిన ఎస్‌.జహీర్‌, గుంతకల్లుకు చెందిన షేక్‌ మహ్మద్‌ తాహీర్‌, షేక్‌ ఆసిఫ్‌ ఉన్నారు. వీరు గుంతకల్లు షికారి కాలనీ చెందిన కమల, మఽధుమతి, జీవా నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. వీరి వద్ద నుంచి 150 గ్రాముల గంజాయి, మూడు మొబైల్‌ ఫోన్లు, రూ.1,900 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ విశ్వనాథరెడ్డి తెలిపారు. గంజాయి సరఫరా చేసే నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement