అనంతపురం అర్బన్: ఏపీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయి అసోసియేషన్ (ఏపీజేఏసీ అమరావతి అనుబంధం) జిల్లా నూతన కమిటీని 12 మంది సభ్యులతో ఎన్నుకున్నారు. ఆదివారం స్థానిక కృష్ణకళామందిర్‌లోని రెవెన్యూ హోమ్‌లో ఏర్పాటు చేసిన సంఘం సమావేశానికి ఏపీజేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ దివాకర్‌రావు, ఓఎస్‌ఈఏ రాష్ట్ర అధ్యక్షుడు సంపత్‌కుమార్, ఎన్‌టీఆర్ జిల్లా అధ్యక్షుడు సతీష్‌కుమార్ హాజరై మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పదవీవిరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక సర్వీస్ రూల్స్ అమలు చేయాలన్నారు. సెర్ఫ్, మెప్మా ఉద్యోగులతో సమానంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలన్నారు. జిల్లా నూతన కమిటీ : సమావేశం అనంతరం ఏపీ ఓఎస్‌ఈఏ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. జిల్లా అధ్యక్షుడిగా భాస్కర్‌నాయుడు, ప్రధాన కార్యదర్శిగా ఈరన్న, కోశాధికారిగా ప్రశాంత్‌ను ఎన్నుకున్నారు. అసోసియేట్ అధ్యక్షుడిగా అశోక్‌కుమార్, ఉపాధ్యక్షులుగా ఖాజా, రాజేశ్వరి, కార్యనిర్వాహక కార్యదర్శులు భరత్, నరసింహారెడ్డి, కార్యదర్శులుగా సుచిత్ర, లోకేష్, ఈసీ సభ్యులుగా పద్మావతి, దిల్షాద్‌ను ఎన్నుకున్నారు.


