ద్విచక్ర వాహనం అదుపు తప్పి వ్యక్తి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

ద్విచక్ర వాహనం అదుపు తప్పి వ్యక్తి దుర్మరణం

Jul 20 2026 1:14 AM | Updated on Jul 20 2026 1:14 AM

వజ్రకరూరు: వెంకటాంపల్లిపెద్దతండా (రూపానాయక్‌తండా) సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ద్విచక్రవాహనం అదుపుతప్పి కొర్రా ఉమ్లానాయక్‌ (39) మృతిచెందాడు. వజ్రకరూరు పోలీసులు తెలిపిన మేరకు.. వెంకటాంపల్లిపెద్ద తండాకు చెందిన కొర్రా ఉమ్లానాయక్‌ మరో వ్యక్తి చిక్కేనాయక్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై ఉరవకొండకు వెళ్లి సొంతూరుకు తిరిగి వెళ్తుండగా, మార్గంమధ్యలో అదుపుతప్పి కిందపడిపోయారు. ఈప్రమాదంలో ద్విచక్ర వాహనం వెనుకవైపున కూర్చున్న ఉమ్లానాయక్‌ బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. భార్య రామ్‌స్వప్నబాయి, కుటుంబ సభ్యులు, బంధువులు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకుని బోరున విలపించారు. ఉమ్లానాయక్‌ మృతదేహాన్ని ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రామ్‌స్వప్నబాయి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement