అనంతపురం సెంట్రల్: నగరంలో తపోవనం సర్కిల్‌లో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో మం జునాథ్ (27) మృతిచెందాడు. సీఐ వెంకటేష్‌నాయక్ తెలిపిన మేరకు.. కుందుర్పికి చెందిన మంజునాథ్ శుక్రవారం నారాయణపురం వైపు నుంచి అనంతపురంలోకి వెళ్తుండగా, హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ ఢీకొనింది. తీవ్రంగా గాయపడిన అత న్ని బెంగుళూరుకు తరలిస్తుండగా మృతిచెందాడు. మృతుడి తండ్రి మేథప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
చెక్ బౌన్స్ కేసులపై నేడు ప్రత్యేక లోక్ అదాలత్
అనంతపురం: చెక్ బౌన్స్‌కు సంబంధించి నమోదైన కేసులపై ఈ నెల 18 ప్రత్యేక లోక్‌అదాలత్ నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ భీమారావు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. శనివారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు చెక్ బౌన్స్ కేసులపై ఉమ్మడి జిల్లాలలోని ప్రతి కోర్టు ఆవరణలోనూ ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.


