న్యాయం కోసం భర్త ఇంటి వద్ద నిరసన | - | Sakshi
Sakshi News home page

న్యాయం కోసం భర్త ఇంటి వద్ద నిరసన

Jul 18 2026 3:47 AM | Updated on Jul 18 2026 3:47 AM

గుంతకల్లు:న్యాయం కోసం ఓ మహిళ తన భర్త ఇంటి వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగింది. వివరాలు.. పట్టణంలోని తిలక్‌నగర్‌లోని మదీనా మసీద్‌ సమీపంలో నివాస ముంటున్న షామీర్‌ బాషా అనంతపురానికి చెందిన శీరీన్‌తో 2011లో వివాహం జరిగింది. సాఫ్ట్‌వేర్‌ అయిన షామీర్‌ బాషా నుంచి తనకు నెలనెలా ఇవ్వాల్సిన రూ.35వేలు, ఇద్దరు పిల్లలకు ఇవ్వాల్సిన రూ.7.50 లక్షలు

కోసం పిల్లలతో కలిసి రోడ్డు బైఠాయించి, నిరసన తెలిపింది. అయితే ఇంట్లో షామీర్‌ బాషా లేకపోవడంతో అతని కుటుంబ సభ్యులతో శీరీన్‌తో గొడవపడ్డారు. టూటౌన్‌ పోలీసులు శీరీన్‌ను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇరువర్గాలను స్టేషన్‌ పిలిపించి పోలీసులు విచారణ చేస్తున్నారు.

వర్షం కోసం ముస్లింల ప్రార్థన

శెట్టూరు: మండల కేంద్రంలోని చెరువులో వర్షం కురవాలని ముస్లింలు శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మండల కేంద్రానికి చెందిన ముస్లింలు పెద్ద ఎత్తున చెరువు వద్దకు చేరుకొని ప్రార్థనలు చేశారు. వర్షాలు లేక రైతులు సకాలంలో విత్తనాలు వేయలేపోయారని, బోరుబావులు ఇంకిపోయి, పంటలు ఎండిపోతున్నాయని, మూగజీవులకు కనీసం మేత దొరక్క అల్లాడుతున్నారని.. మంచి వర్షాలు కురవాలని ప్రార్థించారు. ఈకార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

ఉరవకొండలో ప్రథమ చికిత్స కేంద్రం సీజ్‌

ఉరవకొండ: స్థానిక మూగబసవన్న కట్ట వద్ద ఉన్న ఆఫ్రీన్‌ ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని శుక్రవారం ట్త్రెనీ కలెక్టర్‌ షియాజ్‌కుమార్‌ డీఎంహెచ్‌ఓ ఈబీ దేవి సమక్షంలో సీజ్‌ చేశారు. డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ అఫ్రీన్‌ పథ్రమ చికిత్స కేంద్రంలో రోగులకు నిషేధిత మందులు, ఇంజెక్షన్లు రోగులకు వేస్తూ వారి ప్రాణాలతో చెలగాటమడుతున్నారని తెలిపారు. దీనిపై ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అనేక ఫిర్యాదులు రావడంతో ప్రథమచికిత్స కేంద్రాన్ని సీజ్‌ చేసి, ఆర్‌ఎంపీ వైద్యుడు రోషన్‌కు నోటీసులు ఇచ్చామన్నారు. జిల్లా మాస్‌ మీడియా అధికారి నాగరాజు, స్థానిక వైద్యాధికారిణి వినీత, డిప్యూటీ డెమో లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

కళ్యాణదుర్గం రూరల్‌: పట్టణంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న మూడు డయాగ్నస్టిక్‌ (రక్త పరీక్షలు) సెంటర్లను అధికారులు శుక్రవారం సీజ్‌ చేశారు. శుక్రవారం పట్టణంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ సుయాజ్‌కుమార్‌, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ లక్ష్మీనారాయణ ఆకస్మికంగా పర్యటించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement