అనంతపురం: ఎస్కేయూ పరిధిలో 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ అకడమిక్ క్యాలెండర్‌కు సభ్యులు ఆమోదం తెలిపారు. అకడమిక్ క్యాలెండర్ రూపకల్పనపై వర్సిటీ డీన్ చాంబర్‌లో వీసీ జ్యోతికుమార్ అధ్యక్షతన కళాశాల అభివృద్ధి మండలి సలహా సంఘం సమావేశం శుక్రవారం జరిగింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు సభ్యులుగా పాల్గొని, పలు సూచనలు చేశారు. సమావేశంలో కళాశాల అభివద్ధి మండలి డీన్ ప్రొఫెసర్ డి.ప్రభాకర్, పరీక్షల సంచాలకులు ఎంవీ లక్ష్మయ్య, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు డా. పి. పద్మశ్రీ, డా. ఎం.నాగ శశికళ, డా. పి. హర్షలత, డా. సహదేవుడు, డా. శైలజారాణి, డా. విజయలక్ష్మి పాల్గొన్నారు.
‘పొలంబడి’ని
ప్రతిష్టాత్మకంగా చేపట్టాలి
అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్‌లో పొలంబడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని జేడీఏ ఎన్.సాలురెడ్డి, కమిషనరేట్ ఏఓ కె.లక్ష్మిరెడ్డి, ఏపీ సీడ్స్ సర్టిఫికేషన్ అధికారి ఎం.ప్రతాపరెడ్డి సూచించారు. శుక్రవారం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో అనంతపురం, సత్య సాయి, కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన ఏఓలు, ఏడీఏలకు పొలంబడి కార్యక్రమంపై శిక్షణ ఇచ్చారు. గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ (జీఏపీ) కింద చేపడుతున్న పొలంబడుల ద్వారా మంచి ఫలితాలు సాధించాలన్నారు. ఒక్కో జిల్లాలో 15 వరకు పొలంబడులు ఉన్నాయన్నారు. అందులో వేరుశనగ, కొర్ర, మరికొన్ని పంటల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. త క్షేత్రస్థాయిలో రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
పాముకాటుతో వృద్ధుడి మృతి
రాయదుర్గం రూరల్: కెంచానపల్లి ఎస్సీ కాలనీకి చెందిన హరిజన వన్నూరప్ప (80) పాము కాటుకు గురై శుక్రవారం మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. గురువారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా వన్నూరప్పను పాము కాటు వేసింది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వన్నూరప్పను రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. మృతుడి భార్య కూడా ఇటీవల మృతి చెందింది. మృతుడికి ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తెలిపారు.
అప్పు ఇచ్చిన వ్యక్తికే టోకరా
తాడిపత్రి రూరల్ : ఇంటి వద్దకు వస్తే అప్పు చెల్లిస్తానని నమ్మబలికి అప్పు ఇచ్చిన వ్యక్తి సెల్‌ఫోన్ బలవంతంగా లాక్కోని రూ.1.60 లక్షలు ఫోన్‌పే ద్వారా తన ఖాతాకు బదిలీ చేయించుకున్న నిందితుడిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు అప్‌గ్రేడ్ సీఐ నారాయణరెడ్డి తెలిపారు. పట్టణంలోని నవరంగ్ టాకీస్ వద్ద నివాసం ఉంటున్నా పప్పుల మిల్లు యజమాని హరిప్రసాద్ ఇంటీరియల్ డెకరేషన్ పనులు చేసే లక్ష్మీనారాయణకు రూ.8 లక్షలు అప్పు ఇచ్చాడు. అప్పు తిరిగి స్తానని హరిప్రసాద్‌ను తన ఇంటివద్దకు రావా లని తెలిపాడు. అతని సెల్‌ఫోన్ లాక్కొని ఫోన్‌పే ద్వారా రెండు అకౌంట్ల నుంచి రూ.1.60 లక్ష తన అక్కౌంట్‌కు బదిలీ చేయించు కున్నాడు. బాధితుడు అప్‌గ్రేడ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.


