నేరాల నియంత్రణపై దృష్టి | - | Sakshi
Sakshi News home page

నేరాల నియంత్రణపై దృష్టి

Jul 18 2026 3:23 AM | Updated on Jul 18 2026 3:23 AM

అనంతపురం సెంట్రల్‌: నేరాల నియంత్రణపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని ఎస్పీ జగదీష్‌ ఆదేశించారు. శుక్రవారం పోలీసు కాన్ఫరెన్స్‌హాలులో అర్ద వార్షిక నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలతో స్నేహభావంతో మెలిగినప్పుడే పోలీసులపై సదాభిప్రాయం కలుగుతుందని సూచించారు. ప్రజలను పోలీసుస్టేషన్‌ల చుట్టూ తిప్పుకోరాదని ఆదేశించారు. నేరాల నియంత్రణలో భాగంగా రోడ్డు ప్రమాదాలు నివారణకు కృషి చేయాలని, బ్లాక్‌స్పాట్స్‌ను తనిఖీ చేసి తగు చర్యలు తీసుకోవాలన్నారు. సైబర్‌ నేరాలపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలని కోరారు. అనంతరం పెండింగ్‌లో ఉన్న కేసులను పోలీసు స్టేషన్ల వారీగా సమీక్షించారు. అనంతరం జిల్లాలో ప్రతిభ చూపిన 161 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు మహబూబ్‌బాషా, నాగభూషణం, డీఎస్పీలు రవిబాబు, శ్రీనివాస్‌, సిఐ, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement