టీబీ డ్యాంలో 25 టీఎంసీల నీరు | - | Sakshi
Sakshi News home page

టీబీ డ్యాంలో 25 టీఎంసీల నీరు

Jul 17 2026 3:34 AM | Updated on Jul 17 2026 3:34 AM

బొమ్మనహాళ్‌: అనంతపురం జిల్లా ప్రజల వరప్రదాయిని తుంగభద్ర జలాశయంలో 25.82 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం ఎగువ భాగంలోని శివమొగ్గ, తీర్థనహాళ్లి, చిక్కమగళూరు, వరనాడు, శృంగేరి తదితర ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇన్‌ఫ్లో క్రమంగా తగ్గుతున్నట్లు టీబీ బోర్డు అధికారులు తెలిపారు. రిజర్వాయర్‌ పూర్తి సామర్థ్యం 1,633 అడుగులు కాగా, గురువారం నాటికి 1,603.12 అడుగులకు నీరు చేరింది. 105.788 టీఎంసీలకు గాను 25.82 టీంఎసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో 4,814 క్యూసెక్కులు ఉండగా, 522 క్యూసెక్కులు అవుట్‌ఫ్లోగా నమోౖదైంది. గతేడాది ఇదే సమయానికి డ్యాంలో 1,626.06 అడుగులతో 80 టీఎంసీల నీరు నిల్వ ఉండి 40,117 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 29,607 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో ఉండింది.

పెండింగ్‌ ఈఎఫ్‌లను

త్వరితగతిన పూర్తి చేస్తాం

సీఈఓకు తెలిపిన కలెక్టర్‌ ఆనంద్‌

అనంతపురం అర్బన్‌: పెండింగ్‌ ఈఎఫ్‌లను త్వరితగతిన పూర్తి చేస్తామని కలెక్టర్‌ ఆనంద్‌ చెప్పారు. ‘ఎస్‌ఐఆర్‌’పై సీఈఓ వివేక్‌ యాదవ్‌ గురువారం విజయవాడ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌తో పాటు డీఆర్‌ఓ ఎ.మలోల పాల్గొన్నారు. జిల్లాలో ఎస్‌ఐఆర్‌ గురించి సీఈఓకు ఈ సందర్భంగా కలెక్టర్‌ వివరించారు. ‘ఏఎస్‌డీడీ’ (ఆబ్సెంట్‌, షిఫ్టెడ్‌, డెత్‌, డబుల్‌) జాబితాలకు సంబంధించి 31,914 ఎన్యుమరేషన్‌ ఫారాలు వచ్చాయని, వీటిలో 7,274 ఈఎఫ్‌లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. కొత్తగా 330 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించామన్నారు. నో మ్యాపింగ్‌కు సంబంధించి అనంతపురం అర్బన్‌లో 91,170 ఉన్నాయని, వాటిని మరోసారి పరిశీలిస్తామన్నారు. జిల్లాలో కొత్తగా 330 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు ఈసీకి ప్రతిపాదనలు పంపామన్నారు. కార్యక్రమంలో ఎన్నికల విభాగం డీటీ కనకరాజ్‌, ఎస్‌ఏ శామ్యూల్‌ బెంజిమన్‌ పాల్గొన్నారు.

వైద్యుల నిర్లక్ష్యానికి

మరో ప్రాణం బలి

అనంతపురం జీజీహెచ్‌లో దారుణం

మంత్రి సత్యకుమార్‌ ఇలాకాలో రోజుకో ఘటన

అనంతపురం సిటీ: సర్వజనాస్పత్రి (జీజీహెచ్‌) ఏఎంసీ విభాగం వైద్యుల నిర్లక్ష్యం ఓ రోగి ప్రాణాన్ని బలిగొంది. బుధవారం సకాలంలో స్ట్రెచ్చర్‌ సమకూర్చకపోవడంతో రాయదుర్గం మండలం మల్లాపురం గ్రామానికి చెందిన దేవీబాయి (55) ఆటోలోనే ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువక ముందే గురువారం మరో ఘటన ఆస్పత్రి వర్గాల నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేసింది. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ సొంత ఇలాకాలోనే రోజుకో దారుణం జరుగుతోందంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతోంది. శింగనమల మండలం తరిమెల గ్రామానికి చెందిన నాగన్న (48) శ్వాసకోశ వ్యాధితో బాధపడుతుండడంతో ఈ నెల 11న కుటుంబసభ్యులు జీజీహెచ్‌కి తీసుకువచ్చారు. అప్పటికే తీవ్ర అస్వస్థతకు లోనైన ఆయన ఊపిరి తీసుకునేందుకు సైతం ఇబ్బంది పడుతుండడంతో ఏఎంసీలో చేర్చుకుని చికిత్స మొదలు పెట్టారు. అతడి పరిస్థితి విషమిస్తుండడంతో గురువారం ఉదయం రోగిని వెంటిలేటర్‌పైకి చేర్చారు. ఈ లోపు డ్యూటీ డాక్టర్‌ వచ్చి రోగి చనిపోయాడని నిర్ధారించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే నాగన్న మృతి చెందాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఏఎంసీలో ఆక్సిజన్‌ కూడా సక్రమంగా ఇవ్వలేకపోయారనే ఆరోపణలున్నాయి.

భిన్న వాదనలతో చంపేశారు..

భిన్న వాదనలతో తన తండ్రి ప్రాణాలు పోయేందుకు వైద్యులే కారణమయ్యారంటూ మృతుడు నాగన్న కుమార్తె ధరణి ఆరోపించారు. మానిటర్‌లో హార్ట్‌బీట్‌ చూపిస్తున్నా డాక్టర్‌ వచ్చి పేషెంట్‌ చనిపోయాడని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నైతిక విలువలు లేనివారే ఆస్ప త్రిలో పనిచేస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. ఇప్పటికై నా డాక్టర్లు కొంచైమెనా ఆలోచించాలి’ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement