జనగణనకు గౌరవం ఏదీ? | - | Sakshi
Sakshi News home page

జనగణనకు గౌరవం ఏదీ?

Jul 17 2026 3:34 AM | Updated on Jul 17 2026 3:34 AM

జిల్లాలో గృహగణన నిర్వహించిన ఎన్యుమరేటర్లు

అనంతపురం అర్బన్‌: జనగణన–2027లో భాగంగా గృహగణన కార్యక్రమం జిల్లాలో మే 1వ నుంచి 30వ తేదీ వరకు జరిగింది. జిల్లాలోని రూరల్‌, పట్టణ ప్రాంతాల్లో నెల రోజుల పాటు 3,425 మంది ఎన్యుమరేటర్లు, 583 మంది సూపర్‌వైజర్లు, నగర పాలక సంస్థ పరిధిలో 436 మంది ఎన్యుమరేటర్లు, 70 మంది సూపర్‌వైజర్లు మొత్తం 4,514 మంది గృహగణన ప్రక్రియ నిర్వర్తించారు. ఈ కార్యక్రమంలో భాగమైన ప్రతి ఒక్కరికి గౌరవ వేతనాన్ని కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. జిల్లాలో జనగణన విధులను సిబ్బందితో గౌరవంగా చేయించుకున్న అధికారులు వారికి గౌరవంగా చెల్లించాల్సిన మొత్తాన్ని ఇవ్వలేదు. గృహగణన ప్రక్రియ ముగిసి నెలన్నర దాటినా ఎన్యుమరేటర్లకు, సూపర్‌వైజర్లకు గౌరవ వేతనం చెల్లించలేదు.

రూ.4.60 కోట్లు ఇవ్వాలి

గృహగణన విధులు నిర్వర్తించిన ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు ఒకొక్కరికీ రూ.9 వేలు చొప్పున గౌరవ వేతనం చెల్లించాలి. అదే విధంగా శిక్షణకు హాజరైనందుకు రూ.1,200 ఇవ్వాలి. ఇలా ఒక్కొక్కరి మొత్తం రూ.10,200 చెల్లించాల్సి ఉంది. ఈ ప్రకారం 4,514 మంది ఎన్యురేటర్లు గౌరవ వేతనం రూ.4,06,26,000 చెల్లించాల్సి ఉంది. శిక్షణ హాజరైనందుకు రూ.54,16,800 ఇవ్వాలి. మొత్తం రూ.4,60,42,800 చెల్లించాల్సి ఉంది.

కలెక్టర్‌ పద్దుకు నిధులు

జనగణన కార్యక్రమాలకు సంబంధించిన నిధులను కలెక్టర్ల బ్యాంక్‌ ఖాతాలకు జమ చేస్తూ ఉత్తర్వులను ప్రభుత్వం మే నెల 12న జారీ చేసింది. జనగణనలో భాగంగా చేపట్టిన గృహగణన ప్రక్రియ పూర్తయితే వెంటనే ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు గౌరవ వేతనం చెల్లించాలని పేర్కొంది. ప్రక్రియ ముగిసి నెలన్నర దాటినా ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు గౌరవ వేతనం చెల్లించలేదు. ఎందుకయ్యా అంటే గృహగణనలో నమోదైన ఖాళీ ఇళ్లు, తాళం వేసిన ఇళ్లకు సంబంఽధించి ఎందుచేత ఖాళీగా ఉన్నాయి అనే వివరాలను యాప్‌లో చేయాల్సి ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రక్రియకు సంబంఽధించి ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు రానందున గౌరవ వేతనం చెల్లించలేదని కొందరు అధికారులు చెబుతున్నారు. ఎన్యుమరేటర్లకు, సూపర్‌వైజర్లకు గౌరవ వేతనం చెల్లించాల్సిన అంశాన్ని ఇప్పటికీ కలెక్టర్‌ దృష్టికి అధికారులు తీసుకెళ్లపోవడం ఇందులో కొసమెరుపు.

653 మంది

4,514 మంది

10,200

4.60 కోట్లు

3,861 మంది

విధులు నిర్వర్తించిన ఎన్యుమరేటర్లు, సూపరవైజర్లు

నెలన్నర దాటినా అందని గౌరవ వేతనం

కలెక్టర్‌ పద్దులోనే రూ.4.60 కోట్ల నిధులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement