భూదాన్‌పోచంపల్లి: తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామ శివారులోని హెజిలో లేబోరేటరీస్‌లో గురువారం రియాక్టర్‌ను శుభ్రం చేస్తుండగా వెలువడిన రసాయన వాయువు పీల్చి కెమిస్ట్రీ మృతి చెందాడు. అనంతపురం జిల్లా శింగనమల మండలం ఉల్లికల్లుకు చెందిన పాలమూరు కృష్ణారెడ్డి (43) హెజిలో లేబోరేటరీస్‌లో కొంత కాలంగా కెమిస్ట్రీగా పనిచేస్తున్నాడు. గురువారం కొత్త మందుల బ్యాచ్ తయారీకిగాను రియాక్టర్‌ను శుద్ధి చేస్తుండగా అందులోంచి విడుదలైన విషవాయువు పీల్చడంతో స్పృహతప్పి కిందపడిపోయాడు. వెంటనే కృష్ణారెడ్డిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడు హయత్‌నగర్‌లో కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా
సామాజిక శంఖారావం
అనంతపురం అర్బన్: కుల వివక్షత లేని సమాజం కోసం కేవీపీఎస్ (కులవిక్ష వ్యతిరేక పోరాట సంఘం) ఆధ్వర్యంలో సెప్టెంబరు 15 వరకు జిల్లాలో సామాజిక శంఖారావం కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఓ.నల్లప్ప చెప్పారు. గురువారం స్థానిక సంఘం కార్యాలయంలో సామాజిక శంఖారావం కార్యక్రమాల కరపత్రాలను నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా నల్లప్ప మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా దళిత కాలనీల్లో అధ్యయన యాత్రలు నిర్వహిహించి వారు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, మత, ప్రాంత, లింగ, వివక్షత, అంటరానితనం, శ్మశాన స్థలాలు, తదితర సమస్యలను పరిశీలిస్తామన్నారు. విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి దళితులకు ఏ విధంగా అందుతున్నాయో తెలుసుకుంటామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘం, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శులు కృష్ణమూర్తి, బాలరంగయ్య, పుల్లన్న, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గిరి, శివ, తదితరులు పాల్గొన్నారు.


